Dandoraa Movie Review: టాలీవుడ్ నటుడు, కమెడియన్ శివాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా దండోరా. కుల వివక్ష, పరువు హత్య లాంటి కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందిన ఈ మూవీ తాజాగా విడుదల అయ్యింది. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం డిసెంబరు 25 థియేటర్లలోకి విడుదల అయ్యింది. అయితే ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కథ :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ దగ్గర తుళ్లూరు అనే గ్రామంలో అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి దహనం చేస్తుంటారు. అయితే ఇదే గ్రామంలో శివాజీ ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఇతడు చనిపోతాడు. అప్పుడు కుల పెద్దలు మాత్రం ఇతడి శవాన్ని ఊరి శ్మశానంలో తగలబెట్టడానికి వీల్లేదని తీర్మానిస్తారు. అయితే శివాజీని వాళ్ల కులమే ఎందుకు బషిష్కరించింది? ఇతడి గతం ఏంటి? శివాజీతో కొడుకు విష్ణు(నందు) ఎందుకు మాట్లాడటం మానేశాడు? ఇతడితో వేశ్య శ్రీలత (బిందు మాధవి)కి సంబంధమేంటి అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కుల వివక్షపై వచ్చిన సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. దండోరా కూడా అలాంటి సినిమానే. మరి ఇది ఎలా ఉంది అంటే ఓకే అని చెప్పవచ్చు. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని డీల్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడని చెప్పాలి. అలాగే లాజిక్స్ కూడా మర్చిపోయాడని చెప్పాలి. అణచివేయబడిన కులానికి చెందిన ఒక వృద్ధురాలి శవాన్ని ఊరి చివరకు తీసుకెళ్లే సీన్ తో సినిమా మొదలవుతుంది. 2004 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కథ అంతా సాగుతుంది. ఫస్ట ఆఫ్ అంతా కులం గొడవలు, రవి సుజాతల లవ్ స్టోరీతో టైమ్ పాస్ అయిపోతుంది. కులాన్ని ఎక్కువగా చూసే ఒక గ్రామంలో ఒక మనిషి చచ్చిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్టాప్ ఓకే అనిపించినా సెకండాఫ్ కాస్త ఎంగేజింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కులం కాన్సెప్ట్ పై తీసిన సినిమాల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి మనోవేదన అనుభవిస్తారనే విషయాన్ని బాగా చూపించారు.
నటీనటుల పనితీరు:
నటుడుశివాజీ క్యారెక్టర్ బాగానే ఉంది కానీ ఆ పాత్ర చూడగానే మంగపతి క్యారెక్టర్ కి కొనసాగింపులా అనిపిస్తుంది. రవికృష్ణది రొటీన్ పాత్రే అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ఇక నవదీప్ 2.0 అని ఈ మూవీ టైటిల్స్ లో వేశారు కానీ ఇందులో అతడి పాత్రకు పెద్దగా స్కోప్ దొరకలేదని చెప్పాలి. వేశ్యగా బిందుమాధవి పాత్ర బాగుంది. శివాజీ కొడుకు విష్ణుగా చేసిన శ్రీ నందుకు మంచి స్కోప్ దొరికింది. అలాగే డిఫరెంట్ వేరియేషన్స్ కూడా బాగానే చూపించాడు. శివాజీ కూతురు సుజాతగా చేసిన మనిక చూడటానికి బాగుంది. మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత:
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అలాగే దం దండోరా అని సాగే పాట కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. దర్శకుడు మురళీకాంత్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని చూపించిన విధానం ఓకే అనిపిస్తుంది. కాకపోతే డైరెక్టర్ లో విషయం ఉందని అనిపిస్తుంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లుగానే ఉన్నాయి. స్టోరీ కంటే పాత్రలు, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.
రేటింగ్ : 3/5
