టిటిడికి చంద్రబాబు నుంచి ముప్పు, ఇవే సాక్ష్యాలు

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)

తిరుమల  పరిచయం అక్కర లేని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం. దానిని పాలనా బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) చూస్తుంది.  అలాంటి టిటిడి భవిష్యత్తు నేడు అధికార తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల మూలంగా ప్రమాదంలో పడే పరిస్థితులు  ఏర్పడుతున్నాయి.  సాథారణంగా ఒక  సంస్థలో  జరగకూడని పరిణామాల కారణంగా నష్టం జరగుతుంటుంది. కాని, టిటిడి విషయంలో మాత్రం, దీనికి  బిన్నంగా ఉంది టిటిడి పరిస్థతి. ఈ సంస్థ తప్పు చేస్తే సరిదిద్దాల్సిన స్థానంలొ ఉన్న ప్రభుత్వం అనాలోచిత, అర్థం లేని  రాజకీయ నిర్ణయాల వల్ల నష్టపోతున్నది.

టిటిడి కి ఇతర ఆలయాలుకు ఉన్న వ్యత్యాసం….. దేశంలో దేవాలయాల విషయంలో అనేక మార్పులు సంభవించాయి. దేవాలయాలు గతంలో కొందరి భక్తికి సంబంధించిన విషయం మాత్రమే. కాని నేడు భక్తులు సంఖ్య పెరగడం, ఆదాయం రావడంతో  దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా పర్యాటక కేంద్రాలుగా కూడా మారాయి. ఇపుడు కొన్ని ప్రాంతాల మనుగడ కూడా ఈ సంస్థ కార్యకలాపాల మీద అధారపడే  పరిస్దితులు వచ్చినాయి. నేడు టిటిడి గురించి మాట్లాడు కోవాలంటే అది ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంతో బాటు తిరుపతి, చిత్తూరు జిల్లా భవిష్యత్ కూడా టిటిడి పై  ఆధారపడి ఉన్నది. అలాంటి సంస్థ  విషయంలో నిర్ణయాల తీసునేటప్పుడు ప్రభుత్వం, టిటిడి చాలా జాగ్రత్తగా అలోచించి  తీసుకోవాలి. మిగిలిన ఆలోయాలలో ఏదైనా జరగరానిది జరిగితే  భక్తుల మనోబావాలపై ప్రభావం పడుతుంది. కాని టిటిడి లో అలాంటి సంఘటనలు జరిగితే భక్తుల మనోబావాలపై ప్రభావం  పడటమే కాకుండా తిరుపతి భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. చిత్తూరు జిల్లా భవిష్యత్ ప్రశ్నార్దకం అవుతుంది. అన్నీ తెలిసి తిరుపతిలో చదువుకుని తిరుమల కొండకు ఆనుకుని ఉన్న నారావారి పల్లిలో జన్మించిన రాష్ట్ర రథసారధి అయిన చంద్రబాబు గారి పాలనలో టిటిడి భవితవ్యం ప్రశ్నార్దకం చేసే నిర్ణయాలు వెలువడుతాయని ఊహించగలమా ? కాని అదే జరుగుతున్నది.

ఆర్థిక  ఇబ్బందులు ఉన్న ఏపి ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే దాదాపు జిల్లా అభివృద్దికి కావాల్సిన అవకాశాలను టిటిడి ద్వారా కల్పించవచ్చు అంటే జిల్లా బాధ్యతల నుంచి ఫ్రభుత్వం తప్పుకోవచ్చు. ఉదా టిటిడి ప్రతి ఏటా తన అవసరాల కోసం భక్తులు కానుకల రూపంలో సమర్పించేవి కాకుండా దాదాపు 5,6 వందల కోట్లు వెచ్చించి వ్యవసాయ ఉత్పత్తులను కొంటుంది. దాదాపు అవి అన్నీ చిత్తూరు, రాయలసీమలో లభిస్తున్నవే కాని వాటిలో సింహ బాగం రాష్ట్రం అవతల కొంటుంది. కారణం ఆ దేవుడికే తెలియాలి. టిటిడి అనుకుంటే చక్కర, పాలు, నెయ్యి, బియ్యం లాంటి  వాటితో ముడిపడి ఉన్న సహకార సంస్దలను రాయలసీమ మొత్తంలో స్థాపించి  వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని టిటిడి కొనుగోలు చేయవచ్చు ఉదా.. ఒక్క రోజుకు టిటిడి అవసరం అయ్యే నెయ్యి మాత్రమే ఒక టన్ను. కాని ప్రభుత్వం ఇలాంటి విషయాలలో టిటిడి ని బాగస్వామ్యం చేయకుండా టిటిడి నిబంధనలకు భిన్నంగా నిధులను  దారి మల్లించే చర్యలు చేపడుతుంది.

రాష్ట్రంలోని అనేక దేవాలయాల నిర్వహణను టిటిడి కి అప్పగించడం, పుష్కరాలు లాంటి వాటికి కోట్ల రూపాయిలు వెచ్చించడం, అన్ని రాజధానులలో స్దలం ఇస్దే వాటిలో TTD నమూనా ఆలయాలను నిర్మించడం, అవసరం లేకపోయినా నేతల అవసరాల కోసం కళ్యాణ మండపాలు నిర్మించడం, దర్మప్రచారం పేరుతో విచ్చలవిడిగా నిధలు దానం చేయడం, పలుకుబడి కలిగిన వారి కోసం వారి సంస్థల  పేరుతో కోట్లరూపాయిలు విరాళాంగా  ఇవ్వడం లాంటి చర్యలకు పూనుకుంటున్నారు.

 

నేటి వరకు టిటిడి  ఆర్థికంగాత  బాగానే ఉంది. కాని పరిస్దితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక పరిశ్రమ అయితే నష్టం వస్తే మరో మార్గంలో ఆదాయం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాని ఆలయాలకు ఉన్న ఒకే ఒక అవకాశం భక్తుల రూపంలో వచ్చే కానుకలు తప్ప మరో మార్గం లేదు. 10 వేల మంది శాశ్వత, 15 వేల మంది తాత్కలిక సిబ్బంది జీవితమే కాదు, వేలాది మంది ప్రజల రోజు వారి జీవితం టిటిడి చుట్టూ ఆదారపడి ఉంది. అలాంటి సంస్థకి రేపు హుండీ ఆదాయం తగ్గితే, ప్రభుత్వం జారీ చేస్తున్న జీఓల కారణంగా ఆర్థిక భారం  మోయలేని పరిస్థితి ఎదురయితే, పరిణామాలు ఎలా ఉంటాయో వూహించలేం.  టిటిడి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ బోర్డును నియమించడం, నియామకాలలో ప్రభుత్వ నిర్ణయాలను పాటించడం వరకే ప్రభుత్వ జ్యోక్యం ఉండాలి. మిగిలిన రోజూ వారి వ్యవహరాలను ప్రభుత్వం రూపొందించిన చట్టం పరిధిలో  టిటిడి బోర్డు, కార్యనిర్వాహణాధికారి సారథ్యంలో స్వతంత్రంగా ఉండాలి. కాని ఆచరణలో అందుకు భిన్నంగా  వ్యవహరాలు నడుస్తున్నాయి. పరిపాలన విషయంలో చంద్రబాబుతో  రాజకీయంగా  వ్యతిరేకించేవారు కూడా మెచ్చుకుంటారు. కాని విభజన ఆంద్రప్రదేశ్ తో  ముఖ్యమంత్రిగా  బాబుగారు టిటిడి విషయంలో వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. టిటిడి ని పూర్తిగా  సంస్కరిస్తానని ఎన్నికలలో మాట్లాడిన బాబు వచ్చిన తర్వాత నిర్థిష్టమైన మార్పులు తీసుకు రాలేదు. గతంలో EO, JEO లు రెండు సంవత్సరాలు ఉండేవారు. కాని బాబుగారు మాత్రం  కాంగ్రెస్ ను నిత్యం విమర్శిస్తూనే వారు నియమించిన అధికారులనే నేడూ కొనసాగించడం విశేషం. ఏల్ల తరబడి ముఖ్యబద్రతాదికారిగా ఇన్చార్జిల కు అప్పగించడం, మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహరాలలో  కీలకంగా వ్యవహరించాల్సిన FA, CAO పదవిని గత మూడు సంవత్సరాలుగా అదనపు FA, CAO గారికి అప్పగించడం ప్రధాన  విషయంగా చూడాలి వారి సలహ మేరకే ఆర్థిక విషయాలలో టిటిడి నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా  అయితే అఖిలభారత స్థాయి అధికారికి ఈ బాద్యత ఇవ్వాలి. కాని అందుకు బిన్నంగా అదనపు అధికారికి బాధ్యత ఇచ్చింది.  ప్రభుత్వ తన రాజకీయ నిర్ణయాలను ఏక పక్షంగా ఆమోదింప చేసుకోవడానికేనా  అఖిలభారత స్దాయి అధికారిని నియమించ లేదా అన్న అనుమానం కలగక మానదు.

రెండు పుష్కరాల కోసం దాదాపు 15 కోట్లు వెచ్చించారు. ఇది పూర్తిగా టిటిడి నిబంధనలకు  విరుద్దం. హిందూ మత ప్రచారం అనుకుంటే క్రిష్ణా నది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలి. అదే గోదావరి పుష్కరాలు అయితే ఆ నది మొత్తం మీద నిర్వహించాలి అందుకు బిన్నంగా బాబుగారు కేంద్రీకరించిన విజయవాడ, రాజమండ్రికే పరిమితం చేయమని ఏ హిందూదర్మం చెపుతుంది. ఇపుడు తాజాగా విజయవాడ చుట్టూ 100 కోట్లతో అబివృద్ది కార్యక్రమాలు, గోదావరి ,క్రిష్ణ నదుల మీద టిటిడి ఆలయాలు నిర్మాణం చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇవి అన్నీ అమరావతి చుట్టూనే ఉంటాయి అంటే బాబుగారి రాజకీయ నిర్ణయాలకు టిటిడి ని వాడుకోవడం తప్ప మరోటి కాదు. ఇప్పుడు వెచ్చిస్తున్న నిధులు సంగతే కాదు దీర్ఘకాలం వాటి నిర్వహణకు అవసరం అయ్యే ఖర్చు మాటేంటి. అంతే కాకుండా జీ ఓ నెం 445 పేరుతో 100 కోట్ల టిటిడి ఆస్థిని కేవలం 4,5 కోట్లకే దుర్గగుడికి ఇవ్వడం అది కూడా నామమాత్రంగా అయినా టిటిడి బోర్డును సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం దారుణం.  గమనించాల్సిన మరో విషయం, గతంలో దుర్గగుడికి విజయవాడ బెంజి సర్కిల్, బందరు రోడ్డు ప్రాంతాలలో దాదాపు 50 ఎకరాలు స్థలం ఉండేదని దాన్ని నాడు దూరదృష్టి లేకుండా సిద్దార్ద విద్యాసంస్థలకు నామమాత్రపు అద్దెకు 99 సంవత్సరాలు ఇచ్చినట్లు చెపుతున్నారు. ఇపుడు దాని విలువ వేల కోట్లు. నేడు దుర్గగుడికి పార్కింగ్ స్థలం  లేక TTD ని అడగాల్సిన దుస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రేపు టిటిడి కి రాకూడదనేదే రాయలసీమ వాసుల ఆందోళన.

 

ఈ మధ్య కాలంలో బాబుగారి నిర్ణయాలు మరింత దారుణంగా మారినాయి.  తిరుపతి అబివృధ్ధికి టిటిడి నిధులు కేటాయించాలి. తిరుపతి, తిరుమల వేరు కాదు కాబట్టి ఒక్క భాజపా మాత్రమే గతంలో దీన్ని కూడా వ్యతిరేకించింది.( ఇప్పుడు వారి మంత్రే దేవాదాయ మంత్రి) అయితే ఇపుడు బాబుగారు కేటాయిస్తున్న పద్ధతి  బాగాలేదు. తిరుపతిలోని రోడ్లు నిర్వహణను టిటిడి చూస్తుంది. అదే విదంగా విమానాశ్రయం నించి వచ్చే రోడ్లుకు 10 కోట్లు టిటిడి ఇవ్వాలని జీ ఓ 669 ని ఇచ్చింది. నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాని దాన్ని టిటిడి నిర్వహించకుండా TUDA కు అప్పగించడం అనుమానాలకు తావిస్తుంది. టిటిడి కి బలమైన ఇంజనీరింగ్ వ్యవస్ద ఉంది. అందులోనూ స్వయం ప్రతిపత్తి గల సంస్ద కాబట్టి ఇక్కడ ఇస్టారాజ్యంగా టెండర్లు వేయలేరు. నాణ్యతా  ప్రమాణాలు పాటిస్తారు.  పట్టణాబివృద్ది సంస్థకు ఇవ్వడం అంటే ప్రభుత్వ రాజకీయ నిర్ణయమే ఇక్కడ పని చేస్తుంది. గతంలో కూడా మహనాడు నిర్వహణ సందర్బంలో, సైన్స్ కాంగ్రెస్ పేరుతో ఇష్టా రాజ్యంగా కేటాయింపులు చేశారు. టిటిడి నిబంధనలకు లోబడే తిరుపతి అభివృద్దికి నిధులు కేటాయించాలి ,ఖర్చు చేయాలి. టిటిడి కేవలం శ్రీవారి భక్తుల ప్రయోజనాలకే పరిమితమైన సంస్థకు కాదు తిరుపతి, చిత్తూరు జిల్లాల భవితవ్యం కూడానూ. బాధ్యత  కలిగిన ప్రతి ఒక్కరు టిటిడి ని రక్షించుకోవాలి.  సంస్థలో పని చేసే ఉన్నతాధి కారులు కూడా తాము ప్రభుత్వం ఏమి చెపితే అది చేస్తాం అని కాకుండా రాజకీయ అవసరాల కోసం జారీ చేసే జీ ఓ లను ప్రభుత్వంతో మాట్లాడి రద్దు చేసేలా  వ్యవహరించాలి. గతంలో అనేక మంది అధికారులు అలా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల కతీతంగా రాయలసీమ ప్రజలు ,శ్రీవారి భక్తలు  టిటిడి సంస్థనుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ నిర్ణయాల బారి నుంచి కాపాడాలి.