2022 వ సంవత్సరంలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం …?

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇలవైకుంఠంగా పరిగణిస్తారు. ఏడుకొండల పై కొలువై ఉన్న తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. శ్రీవారిని దర్శించడానికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా క్యూ లైన్ లో నిలబడతారు. ఎంతో మహిమగల ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశం నలవైపుల నుండి ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు తిరుమాల చేరుకుంటారు. అయితే స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు చాలామంది వారి మొక్కలు కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి ఏడూ స్వామివారి హుండీ ఆదాయం పెరుగుతూనే వస్తోంది.

అయితే కరోనా విజృంభించిన కారణంగా 2020, 2021 వ సంవత్సరంలో భక్తులు స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వీలు లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో స్వామివారి హుండీ ఆదాయం చాలా తగ్గింది. అయితే 2022వ సంవత్సరంలో కరోనా ఆంక్షలు ఎత్తివేయటం భక్తులు స్వామిని దర్శించి వారి ముడుపులు చెల్లించుకున్నారు. అందువల్ల ఈ ఏడాది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు టీటీడీ వెల్లాడించింది. ఈ ఏడాది దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

2022వ సంవత్సరం ముగిసేనాటికి తిరుమల శ్రీవారికి కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించిందని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి ఆస్తుల విషయంపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి శ్వేత పత్రం విడుదల చేశాడు. 2022 వ సంవత్సరంలో మొత్తం 2.35 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని, 1.08 కోట్ల మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారని, అలాగే 2022 వ సంవత్సరంలో మొత్తం 11.42 కోట్ల శ్రీవారి లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ (TTD) వెల్లడించింది.