శ్రీవారి భక్తులు అలర్ట్…. తిరుమలలో కొత్త రూల్స్ అమలుచేయనున్న టిటిడి..?

ఇలవైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు కొన్ని వేల మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. భక్తుల కోసం టీటీడీ ఇప్పటికే ఎన్నో సదుపాయాలను కల్పించింది. అలాగే అక్కడ ఎటువంటి అవాంఛిత చర్యలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మరొక కొత్త రూల్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డు ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపులు తదితర విషయాల్లో మరింత పాదర్శకతం కోసం ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు టిటిడి వెల్లడించింది.

ఈ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఉపయోగిస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. అంతేకాకుండా గతంలో తిరుపతి దేవస్థానంలో డ్రోన్ కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. మరొకసారి అటువంటి చర్యలు దేవస్థాన ఆవరణలో జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే భక్తులు ఉచిత లడ్డూల కోసం అదనంగా టోకెన్లు తీసుకొని అవకాశం లేకుండా కూడా చర్యలు చేపట్టారు.

స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు అధిక లడ్డు టోకెన్లు తీసుకోకుండా నివారించేందుకు, అలగే వసతి గదుల కేటాయింపు కేంద్రాల వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా దళారీ వ్యవస్థకు కూడా చెక్ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మాఘమాసం పూర్తి కావడంతో తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రస్తుతం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే వేచి ఉన్నారు. ఇక శ్రీవారి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.