ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పథకాలు అంత బాగున్నాయా? అవి ఎంత గోప్పవో తెలిస్తే, తమకూ అలాంటి పథకాలు కావాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తారా? ఈ ఎన్నికల్లో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బలపరుస్తారా?
టిఆర్ ఎస్ ఆందోళన చూస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. ఆంధ్రలో అమలవుతున్న పథకాల గురించి తెలంగాణ లో ప్రచారం చేయడమేమిటని ఈ పార్టీ ప్రశ్నిస్తుంది. తెలంగాణ మీడియాలో వస్తున్నఎపి సంక్షేమ పథకాలను ఆపేయాల్సిందే టిఆర్ ఎస్ చెబుతున్నది. ఒక విధంగా చంద్రబాబు పథకాలకు పరోక్షంగా ఇది కితాబే. తన పథకాలను, ప్రాజక్టుల సమర్థవంతంగా ప్రచారం చేసుకుని మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకోవడం చంద్రబాబు వ్యూహం. ఈ ప్రచారమే ఆయన్నిగతంలోనే కాదు, 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది. విభజన అనంతరం రాజధాని లేని ఆంధ్ర ప్రదేశ్ ను పునర్నిర్మించాలంటే చంద్రబాబు వంటి సీనియర్, పాలనా దక్షుడు రావాలనే ఐడియాను చర్చనీయాంశం చేశారు. అదే ఆయన్ని అధికారంలోకి తెచ్చింది. ఇదే ఉద్దేశంతోనే తాను చంద్రబాబు నాయుడిని తాను సమర్థించానని జనసేననేత పవన్ కల్యాణ్ ప్రతిరోజూ చెబుతున్నారు. ఇపుడు చంద్రబాబు ప్రచారం ప్రభావం తెలంగాణాలో కూడా ఉంటుందేమో నని టిఆర్ ఎస్ కూడా ఆందోళన చెందుతూ ఉంది. ఇది నిజం.
ఈరొజు టిఆర్ ఎస్ ఏమి చేసిందో చూడండి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి ప్రభుత్వ పథకాల అడ్వర్టైజ్ మెంట్ లతో తెలంగాణా ప్రజలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళన చెందుతున్నది. తెలంగాన మీడియాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం విపరీతంగా చేయడం జరుగుతున్నది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తున్నందున ఆ ప్రచారం ప్రభావం ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎలా అని పార్టీ ఆలోచిస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల మీడియా ప్రకటనలను నిలిపివేయాలని పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది. ఈ మేరకు టిఆర్ ఎస్ కరీంనగర్ ఎంపి బి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రాష్ట ఎన్నికల అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాష్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వినోద్ కుమార్ మాట్టాడుతూ ఏమన్నారో చూడండి.
# టివి ఛానెల్ లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అద్వటేజ్మెంట్ లు విస్తృతంగా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అక్కడి పథకాల గురించి ఇష్టానుసారంగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బుతో ప్రకటనలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు పార్టీ తెలుగుదేశం తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది.అంతేకాకుండా చంద్రబాబు కాంగ్రెస్ కలిసి కూటమి ఏర్పడింది. ఇక్కడ టిడిపి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ పథకాల ప్రభావం గురించి మేము ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకువచ్చాం.
# తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం లేనప్పటికీ ఆ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము తో ప్రకటనలు ఇస్తున్నారు.వారు పార్టీ పరంగా ప్రకటనలు ఇవ్వొచ్చు.మాకు అభ్యంతరాలు లేవు.అయితే, ఇాది అధికార దుర్వినియోగం. అందువల్ల చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయాలని కోరాం.