షాకింగ్: మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళకి మావోల బెదిరింపులు

మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపు కాల్స్ విపరీతంగా వస్తున్న తరుణంలో ఆయన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు లేఖ రాశారు. ఈ లేఖను మంగళవారం ఆయనే స్వయంగా డీజీపీకి అందించారు. ఈ లేఖలో ఆయనకు బెదిరింపు కాల్స్ విపరీతంగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు భద్రత పెంచాలంటూ ఆ లేఖలో ప్రతిపాదించారు.

అనేకమంది తనను టార్గెట్ చేశారంటూ ఆయన డీజీపీకి కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక విషయాన్నీ డీజీపీకి గుర్తు చేశారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకు గతంలో కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు. ఈ బెదిరింపులకు కారణం అక్రమాలకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటమే అని తెలిపారు. ముఖ్యమంత్రి అక్రమ నివాసం, రాజధాని భూసమీకరణ, ఓటుకు కోట్లు కేసు, సదవర్తి సత్రం భూముల వ్యవహారాలపై తాను న్యాయ పోరాటాలు చేస్తున్నాని తెలిపారు. ఈ తరుణంలోనే తనకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ అందిస్తోంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పలు న్యాయ పోరాటాల వలనే బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆర్కే చెబుతున్నారు. ఇసుక మాఫియా నుండి బెదిరింపు లేఖలు, హతమారుస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. మావోయిస్టుల పేరిట కూడా ఈమధ్య కాలంలో బెదిరింపు లేఖలు వస్తున్నాయని ఆర్కే అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన భద్రతను పెంచాలని, కనీసం 2 + 2 గన్ మెన్ సెక్యూరిటీటీ అందజేయాలని ఆయన డీజీపీకి అందించిన లేఖ ద్వారా కోరారు.

ఇటీవలే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోలు ఏజెన్సీలో హతమార్చారు. ఈ వార్త మావోల ప్రభావితం అధికంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపింది. ఈ కేసు వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణుడికి కూడా మావోలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటూ వార్త బయటకి రావడం కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఆర్కే కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

జగన్ పై తెలంగాణ మంత్రుల అనూహ్య వ్యాఖ్యలు https://bit.ly/2Cz8075