వైఎస్‌ జగన్‌ కు మహష్ విషెష్, ఫార్మాలిటీగానా?

ఏపీ అంసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సంగతి తెలిసిందే. మరో వారంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఏపీతో సంబంధం ఉన్న అనేక మంది ప్రముఖులు జగన్‌కు అభినందనలు తెలుపుతున్నారు. వారిలో సినీ సెలబ్రిటీలు ప్రముఖంగా కనిపిస్తున్నారు.

తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ లో అభినందనలు తెలిపారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అయితే ఈ విషెష్ చూసిన జగన్ అభిమానులు ఆనందపడుతున్నారు.

మహేష్ తండ్రి కృష్ణగారు కూడా వైయస్ అన్నా, జగన్ అన్నా మంచి అభిమానం చూపిస్తారని, ఇప్పుడు మహేష్ సైతం అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నాడంటున్నారు. అయితే దీన్ని కొందరు ఖండిస్తున్నారు. అంత సీన్ లేదు. మహేష్ చాలా క్యాజువల్ గా ఫార్మాలిటీగా విషెష్ చెప్పాడంటున్నారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ప్రధాని మోడీ సైతం ఆయన అభినందనలు తెలియచేసారు.

https://twitter.com/urstrulyMahesh/status/1131844148175073280

ఇప్పటికే రవితేజ, మంచు మోహన్ బాబు, నిఖిల్, మంచు విష్ణు, రాజశేఖర్, నాగార్జున, సుమంత్ లాంటి నటులంతా జగన్‌కు శుభాకాంక్షలు తెలుపారు.