సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సు యాక్సిడెంట్ (వీడియో)

సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్దులకు తీవ్రగాయాలయ్యాయి. పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్దులను తీసుకెళ్తున్న బస్సు రోడ్డు నుంచి అదుపు తప్పి పక్కకు దూసుకుపోయింది. బస్సులో ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. విద్యార్దులంతా కూడా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.

ప్రమాదంతో విద్యార్దులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. చిన్నారులంతా భయంతో ఏడ్వసాగారు. చుట్టు పక్కల వరి చేన్లలో ఉన్న కూలీలు వచ్చి చిన్నారులను బయటకు తీసి వారిని ఓదార్చారు. అంబులెన్స్ కు ఫోన్ చేసి వారిని ఆస్ప్రత్రికి తరలించారు. ఎన్నికల సందర్బంగా గురువారం పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కూడా పాఠశాల పెట్టారని విద్యార్దుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బస్సు ప్రమాదం వీడియో కింద ఉంది చూడండి.