Pawan Kalyan: టాలీవుడ్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఆయన నటించిన సినిమాలు త్వరలోనే ఒకదాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ సంగారెడ్డి జిల్లాకు వచ్చారు.. ప్రస్తుతం రాజకీయాలు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ సంగారెడ్డికి ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారా, ఎందుకంటే సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ కి వచ్చారు..
తన చిన్న కొడుకు మార్క్ శంకర్ కు ఇక్రిశాట్ ఆవరణలోని ఇంటర్నేషనల్ ఆఫ్ హైదరాబాద్ లో అడ్మిషన్ కోసం వచ్చిన పవన్ కల్యాణ్ కాసేపు అక్కడే ఉండి స్కూల్ ను పరిశీలించారు. అయితే ఇటీవల తన చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతుండగా ఆ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించి మార్క్ శంకర్ కు గాయాల అప్పటినుండి అతను హైదరాబాదులోనే ఉంటుండగా తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మార్క్ శంకరును ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు సమాచారం.
ఇప్పటికే ఈ ఇక్రిశాట్ ఆవరణలో ఉన్న ఇంటర్నేషనల్ హైదరాబాద్ స్కూల్లో పలువురు సినీ ప్రముఖుల పిల్లలు చదువుతుండగా పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుకును కూడా ఇందులోనే జాయిన్ చేయించాలని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా ఎవరికి తెలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మీడియా కూడా అలో చేయలేదు.