రేవంత్ షాకింగ్ డెసిషన్: కాంగ్రెస్ లో కలవరం

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల ముందు తనదైన శైలిలో ప్రత్యర్థులపై మాటల తూటాలు వదిలిన రేవంత్ రిజల్ట్స్ తర్వాత మౌనం వహిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు రేవంత్. టీఆరెస్ అభ్యర్థి పట్నం నరేందర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. యావత్ తెలంగాణ రేవంత్ ఓడిపోవడంతో షాక్ కి గురయ్యింది. అయితే రేవంత్ పాలమూరు లేదా చేవెళ్ల నుండి ఎంపీ స్థానాల్లో ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అవన్నీ కాదని రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం కింద ఉన్న మ్యాటర్ చదవండి.

ఇటు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉంది. అభిమానులు ఆయన్ని టైగర్ అని పిలుచుకుంటారు. ఆయన కూడా అదే తరహాలో ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రత్యర్ధులు ఎవరైనా సరే ఆయన భయపడకుండా, తొణకకుండా ఘాటు విమర్శలు చేస్తారు. కూటమి ఓడినా రేవంత్ ఓడిపోతాడు అని ఎవరూ ఉహించి ఉండరు. అటువంటిది అనూహ్యంగా రేవంత్ ఓటమిపాలయ్యారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఈవీఎం ట్యాపరింగ్ జరిగింది అంటూ ఆరోపించారు. కానీ రేవంత్ మాత్రం ప్రజాక్షేత్రంలో గెలుపోటములు సహజం. ప్రజాతీర్పును గౌరవించి మరింత బాధ్యతగా వ్యవహరిస్తాను అని మీడియా ఎదుట గద్గద స్వరంతో చెప్పిన మాటలు. ఆ తర్వాత ఆయన బయటకి రాలేదు.

అభిమానులు ఆయన మౌనముతో కలత చెందారు. ఈ తరుణంలో ఒకసారి కొడంగల్ నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ రెండు సందర్భాల్లో తప్ప రేవంత్ బయట కనిపించలేదు. అనంతరం ఆయన బయటకి రావట్లేదు. కేవలం రెండుసార్లు మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు విరామం తీసుకుని కుటుంబంతో కలిసి మధ్యప్రదేశ్ విహారయాత్రకు వెళ్లారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో గడిపిన ఆయన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో టైగర్ అంటూ రేవంత్ ఫోటోలు వైరల్ చేస్తున్నారు అభిమానులు.

కాగా రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆయన రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడొద్దని నిర్ణయించుకున్నారట. ఆయన నిర్ణయంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు షాక్ కి గురవుతున్నారు. రేవంత్ సైలెంట్ గా ఉంటే కేసీఆర్ ని, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే నాయకుడే ఉండదని భావిస్తున్నారు. అయితే రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు స్పందించాల్సి ఉంది.

Read This Also