పిచ్చి అభిమానం.. పవన్ కి ప్రాణాంతకంగా మారుతున్న తన అభిమానులు..!

తెలుగు సినిమా దగ్గరే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ కళ్యాణ్ బయటకి వస్తే భారీ ఎత్తున జనం తెలుగు రాష్ట్రాల్లో పోగవుతారు. ఇక ఇప్పుడు పవన్ కూడా జన క్షేత్రంలోనే ఉంటుండడంతో తాను ఎక్కడకికి వెళ్లినా తండోపతండాలుగా తన క్రేజీ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు.

అయితే పవన్ కి చాలా తీవ్ర స్థాయి అభిమానులే ఉన్నారు. దీనితో పవన్ అనేక సార్లు ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి తాజాగా అయితే పవన్ కి తన అభిమానులు వల్లే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిన్న జరిగిన తన ఓ పొలిటికల్ మీటింగ్ లో ఓ అభిమాని పవన్ కాళ్ళ మీద పడిపోయాడు.

దీనితో పవన్ పడిపోయినంత పని అయ్యింది. అయితే ఇలా ఇంతకు ముందు రెండు మూడు సార్లు జరగ్గా పవన్ పడిపోయారు. అయితే నిన్న మాత్రం పవన్ తనకి కలిగిన నొప్పిని బయటకి చూపించలేకపోయారు. పవన్ కి ఎప్పుడు నుంచో వెన్ను నొప్పి ఉన్న సంగతి తెలిసిందే. అది నిన్న ఈ షాకింగ్ ఘటనపై తీవ్రం అయ్యింది.

ఆ వీడియోలో చూసినా అందరికీ కూడా కనిపిస్తుంది. దీనితో పవన్ కూడా తన అభిమానులను ఇలాంటివి చెయ్యొద్దని నా ప్రాణం మీదకి వచ్చే అభిమానం వద్దని సున్నితంగా చెప్పాడు. కానీ ఈ వీడియోలో అయితే పవన్ కాస్త నొప్పికి లోను కావడం మాత్రం కనిపించింది. మరి తన అభిమానులు ఇలాంటివి అన్ని మనుకుంటారో లేదో చూడాలి.