జగన్ ప్రభుత్వం ఆయుష్షు నాలుగేళ్ళే

మామూలుగా ఎన్నికల ద్వారా ఏర్పడిన ఏ ప్రభుత్వం ఆయుష్షు అయినా ఐదేళ్ళన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మొన్ననే ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయుష్షు మాత్రం నాలుగేళ్ళకే ముగుస్తోంది. అందుకు కారణం జమిలి ఎన్నికలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మొన్న ఢిల్లీలో ప్రధానమంత్ర నరేంద్రమోడి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో జమిలి ఎన్నికల అంశమే ప్రధాన అజెండాగా సమావేశం జరిగిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలు అంటే దేశమంతా పార్లమెంటు ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరపించటమే జమిలి ఎన్నికలు.

జమిలి ఎన్నికలపై మోడి బాగా ఇంట్రెస్టు చూపిస్తున్నారు. సరే దాని వల్ల వచ్చే లాభనష్టాలను పక్కనపెడితే మొన్నటి సమావేశంలో జమిలి ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి సైతం రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే 2025 వరకూ జగన్ ప్రభుత్వ కాలపరిమితి ఉన్నప్పటికీ ఒక ఏడాది ముందుగానే అంటే 2023 లేదా 2022 చివరికే కుదించుకునేందుకు జగన్ అంగీకరించారు.

జమిలి ఎన్నికలపై కేంద్రప్రభుత్వం గనుక నిర్ణయిస్తే  తెలంగాణాలో కూడా ఎన్నికలు దాదాపు ఏడాదిన్న ముందే జరిగిపోతోంది. ఎన్నికలకు ముందుగా వెళ్ళటం వల్ల జగన్ కు లాభాలూ లేకపోలేదు. షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు జరగటం వల్ల మంచి దూకుడు మీదున్న జగన్ రెండోసారి కూడా మంచి మెజారిటితో గెలిచేందుకు అవకాశం ఉంది.