ఓటుకు నోటు కేసు… సీఎం కేసీఆర్ పై మత్తయ్య సంచలన ఆరోపణలు

దేశ వ్యాప్తంగా ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. తెలంగాణ, ఆంధ్రా రాజకీయాలను  ఈ కేసు ఓ కుదుపు కుదుపేసింది. ఈ కేసులో నాకు సంబంధం లేకున్నా అన్యాయంగా నన్ను ఇరికించారన్నాడు. ఓటుకు నోటు కేసులో ఇరు రాష్ట్రాల సీఎంల పాత్ర ఉందన్నారు. రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పోటి చేయకుండా చూడాలన్నారు. ఈ కేసు పై ఎన్నికలకు ముందే దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

మట్టయ్య

హైకోర్టు కూడా తనను నిర్దోషిగా పేర్కొందన్నారు. సుప్రీం కోర్టులో తాను వేసిన కేసులో ఉదయ సింహా ఎలా ఇంప్లీడ్ అవుతారని ప్రశ్నించారు. ఉదయ సింహాతో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు  ఇంప్లీడ్ కావాలన్నారు. ఓటుకు నోటు కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశం పై ఈ నెల 11 న ఢిల్లీలలోని జంతర్ మంతర్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారని మత్తయ్య సంచలన ఆరోపణలు చేశారు. వాటికి నేను లొంగలేదని, ఈ కేసు విషయంలో తన తప్పే లేదని మత్తయ్య అన్నారు.