Kitchen Tips: సాధారణంగా మనం ప్రతిరోజు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము అయితే కొన్నిసార్లు మనం వంటలు తయారు చేసేటప్పుడు మనకు తెలిసి తెలియకుండా కాస్త నూనె ఎక్కువగా పడుతుంది. అయితే ఇలా నూనె ఎక్కువ వేసుకుని తినే అలవాటు కొంతమందికి ఉన్నప్పటికీ చాలామంది ఇలా అధిక మోతాదులో నూనె తినడానికి ఇష్టపడరు. ఇకపోతే మాంసాహారం చేసేటప్పుడు నూనె కాస్త ఎక్కువగా వేయటం వల్ల తినడానికి రుచిగా అనిపించదు.
ఈ విధంగా మనం తయారు చేసే వంటలలో కనుక నూనె ఎక్కువ పడినట్లు అయితే దానిని తొలగించడానికి వీలు లేక అలాగే తింటూ ఉంటారు కానీ ఈ సింపుల్ చిట్కాని కనుక పాటిస్తే వంటలలో పడిన నూనెను మనం ఈజీగా తొలగించవచ్చు. మరి ఏ విధంగా అధికంగా ఉన్న ఈ నీటిని తొలగించాలి అనే విషయానికి వస్తే.. చాలామంది వంట పూర్తి అయిన తర్వాత స్పూన్ సహాయంతో ఆ నూనెను మొత్తం తొలగిస్తూ ఉంటారు.
ఇలా కాకుండా మన ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్ తీసుకొని మనం తయారు చేసిన ఆ కూరలో ఎక్కడైతే నూనె అధికంగా ఉందో ఆ భాగంలో ఐస్ క్యూబ్ పైన పెట్టడం వల్ల ఆ నూనె మొత్తం ఐస్ క్యూబ్ గ్రహిస్తుంది. తద్వారా కూరలో ఎక్కువ నూనె ఉన్న భావన ఎవరికి ఉండదు. ఈ సింపుల్ చిట్కాతో కూరలో ఎక్కువ పడినటువంటి నూనెను తొలగించడమే కాకుండా ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలను మనం తినవచ్చు.