Dried Lemon: నిమ్మకాయలు వాడిపోయాయని పడేస్తున్నారా.. ఈ లాభాలు తెలిస్తే అసలు పడేయరు?

Dried Lemon: సాధారణంగా మనం ఇంట్లో నిమ్మకాయలను నిల్వ చేసుకొని ఉంటాము. నిమ్మకాయలను వంటలలో విరివిగా ఉపయోగించుకోవడమే కాకుండా పూజలు ఇతరత వాటికోసం వాడుతూ ఉంటాము కనుక నిమ్మకాయలను ఇంట్లో నిలువ చేసుకొని ఉంటారు. అయితే చాలా రోజులు వరకు నిమ్మకాయలు ఇంట్లో నిల్వ ఉంటే అవి వాడిపోతాయి. ఈ విధంగా నిమ్మకాయలు వాడిపోయాయని చాలామంది వాటిని పడేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు తెలిస్తే మాత్రం వాడిపోయిన నిమ్మకాయలను ఎవరు కూడా పడేయరు.

ఎండిపోయిన నిమ్మకాయలను మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇలా ఎండిపోయిన నిమ్మకాయలను ఉపయోగించేముందు అవి మంచిగా ఉన్నాయా లేక చెడిపోయా అన్న విషయాన్ని గ్రహించుకొని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎండిపోయిన నిమ్మకాయల ద్వారా మనం బట్టల పై ఉన్నటువంటి మురికిని తొలగించవచ్చు కొద్దిగా డిటర్జెంట్ వేసి ఎక్కడైతే మరకలు ఉంటాయో అక్కడ నిమ్మ రసం వేసే రుద్దడం వల్ల ఆ మరకలు తొలగిపోతాయి.

ఇక ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఎండిన నిమ్మకాయలను కట్ చేసి అందులో ఉన్న జ్యూస్ నీళ్లలో వేసుకుని ఫ్లోర్ క్లీన్ చేయడం వల్ల సూక్ష్మ క్రిములు అన్ని కూడా తొలగిపోతాయి. ఇక పాత్రలు తోమడానికి కూడా ఈ ఎండిన నిమ్మకాయలు పనికి వస్తాయి. ఏదైనా జిడ్డు మరకలు ఉన్న పాత్రలను ఎండిన నిమ్మకాయల ద్వారా నీటిగా శుభ్రం చేసుకోవచ్చు. ఇక నిమ్మకాయ ఎండి పోతే దానిని మరింత ఎండబెట్టి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని సెనగ పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి నలుగులా పెట్టుకొని స్నానం చేయటం వల్ల చర్మం ఎంతో సున్నితంగా అలాగే కాంతివంతంగా మెరుస్తుంది.కొన్ని కొన్ని సార్లు నోరు అనేది దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు నిమ్మ తొక్కల నుండి మొత్తం రసాన్ని పిండేసి దంతాలపై రుద్దండి. మరి ఎక్కువగా రుద్దకుండా నెమ్మదిగా రుద్దటం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా ఎండిన నిమ్మకాయలతో ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఇకపై ఎవరు ఎండిన నిమ్మకాయలను పడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు.