Beauty Tips: స్ట్రెచ్ మార్క్స్ మీ అందాన్ని చెడగొడుతున్నాయా… ఈ చిట్కాతో చెక్ పెట్టండి?

Beauty Tips: సాధారణంగా ప్రతి మహిళ ఎదుర్కొని సమస్యలలో స్ట్రెచ్ మార్క్స్ సమస్య కూడా ఒకటి. పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్ అయిన సమయంలో పొట్ట పెరుగుతుంది తద్వారా మనకు దురద పెట్టినప్పుడు చర్మంపై మనం ఎక్కువగా గోకడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. అయితే ఈ మార్చ్ డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్క మహిళ పొట్ట పైభాగంలో కనపడుతూ ఉంటాయి. ఇలా పొట్టపై భాగంలో ఇలాంటి గీతలు ఉండటం వల్ల చీర కట్టుకున్నప్పుడు ఎంతో అందవిహీనంగా కనబడుతూ ఉంటుంది దీంతో చాలామంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సాధ్యం కాదు.

ఇక చాలామంది మార్కెట్లో లభించే వివిధ రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు అయినప్పటికీ ఈ సమస్య నుంచి ఉపశమనం కలగదు .అయితే ఈ విధమైనటువంటి స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవడం కోసం ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే మీ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని చెప్పాలి. మరి స్ట్రెచ్ మార్క్స్ ఎలా పోగొట్టుకోవాలి ఏం చేయాలి అనే విషయానికి వస్తే…

మన భారతీయ సాంప్రదాయం ప్రకారం వంటలలో అలాగే ఆయుర్వేద శాస్త్రంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇలా పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కనుక పసుపుకు ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే చిటికెడు పసుపు చిటికెడు శనగపిండి ఒక గిన్నెలో తీసుకొని అందులోకి కొన్ని పాలను పోసి మెత్తటి మిశ్రమం లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో పట్టించాలి. ఇలా ఈ మిశ్రమం ఆరిన తర్వాత తడి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయటం వల్ల పొట్టపై ఏర్పడినటువంటి స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తొలగిపోతాయి. ఈ సింపుల్ చిట్కా వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మీరు తిరిగి మీ అందాన్ని పెంపొందించుకోవచ్చు.