Home Tips: వర్షాకాలం దోమలు బెడద ఎక్కువగా ఉందా.. ఈ సింపుల్ చిట్కాని పాటిస్తే చాలు?

Home Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు బయట ఎక్కువగా నీరు నిలబడి ఉంటాయి. అదేవిధంగా ఇంటి ఆవరణంలో చెట్లు మొక్కలు పెరగటం వల్ల దోమల ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. ఈ విధంగా దోమల బెడద ఎక్కువగా ఉండటం వల్ల ఈ సీజన్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు బారిన పడాల్సి ఉంటుంది.. అయితే దోమలను అరికట్టడం కోసం చాలామంది మస్కిటో కాయిల్స్ లేకపోతే దోమల అగరబత్తి, ఆల్ అవుట్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని ఉపయోగించటం వల్ల చాలామందికి ఆస్తమా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇంట్లో ఎవరైనా ఆస్తమా సమస్యలతో బాధపడుతున్న చిన్నపిల్లలు ఉన్న వీటి వాసనను భరించలేరు అందుకే ఇలాంటి హానికరమైనవి ఏవి కాకుండా సింపుల్గా చిన్న చిట్కాను పాటిస్తే దోమల బెడద తప్పించుకోవచ్చు. మరి దోమలకు ఏ విధంగా చెక్ పెట్టాలి అనే విషయానికి వస్తే ముందుగా ఒక దీపపు ప్రమిదనం తీసుకోవాలి అందులో బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఇలా కట్ చేసిన బిర్యాని ఆకులలోకి హారతి కర్పూరం బాగా నులిమి ఆ పొడిని కూడా వేయాలి. ఇలా రెండు కర్పూరపు బిల్లలు వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన ఈ బిర్యానీ ఆకులను మంట పెట్టి వెలిగించాలి. బిర్యానీ ఆకులు ఖాళీ అయిన తర్వాత అందులోకి ఆముదపు నూనె లేదా కొబ్బరినూనె లేకపోతే నువ్వుల నూనె ఇలా ఏది అందుబాటులో ఉంటే ఆ నూనె కొద్దిగా వేసి ఒక రెండు వత్తులు వేసి వెలిగించాలి. ఇలా చేయటం వల్ల ఆ వాసనకు ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు అయితే కి చిట్కా పాటించే ముందు కిటికీలు డోర్లు వేయటం వల్ల దోమలన్నీ చనిపోతాయి. ఇక బిర్యానీ ఆకులు అందుబాటులో లేనివారు కొద్దిగా కొబ్బరి నూనె కర్పూరపు పౌడర్ వేసి దీపం వెలిగించిన మంచి ఫలితాలను పొందవచ్చు. దీనివల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు.