ఇంట్లో లాఫింగ్ బుద్ధా ఆ దిశగా పెట్టుకుంటే మంచిదా.. ఈ విగ్రహం వల్ల నష్టాలు, లాభాలు ఇవే!

మనలో చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని శుభమనలో చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఎవరైతే ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటారో వాళ్లకు ఇంట్లో సుఖ సంతోషాలు కలగవని తెలుస్తోంది. కొంతమంది వాస్తు శాస్త్ర నిపుణులు లాఫింగ్ బుద్ధ విగ్రహం వల్ల నష్టాలే తప్ప ఎలాంటి లాభాలు ఉండవని చెబుతున్నారు.

అయితే మరి కొందరు నిపుణులు మాత్రం లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే సంపద, అదృష్టం కలిసొస్తుందని వెల్లడిస్తున్నారు. వేర్వేరు ఆకారాలలో ఉన్న లాఫింగ్ బుద్ధా విగ్రహాలు అందుబాటులో ఉండగా పెద్ద పొట్టతో ఉన్న లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని చూస్తే మనస్సుకు ప్రశాంతత కలుగుతుందని చెబుతారు. లాఫింగ్ బుద్ధ బొడ్డుని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సంపద, శ్రేయస్సు కలుగుతుందని పురాణాలలో పేర్కొన్నారు.

ఇంటికి ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. లివింగ్ రూమ్, ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా, బెడ్ రూమ్ లో ఎక్కడైనా లాఫింగ్ బుద్ధని పెట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి. లాఫింగ్ బుద్ధను డబ్బును ఆకర్షించడానికి పెట్టుకోవాలని భావించే వాళ్లు ఇంటి ప్రవేశ ద్వారంలో తలుపుకి ఎదురుగా లేదా ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటే మంచిది.

ఇంటికి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిల్లలకి చదువు మీద శ్రద్ద కలగాలి అనుకునే వాళ్లు స్టడీ టేబుల్ మీద నవ్వుతున్న బుద్ధుని విగ్రహం ఉంచడం ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. లాఫింగ్ బుద్ద విగ్రహం పూజ చేయడానికి పనికిరాదు. షూ ర్యాక్ పైన ఈ విగ్రహాన్ని పెట్టడం మంచిది కాదు.

లాఫింగ్ బుద్ధ వేర్వేరు రూపాల్లో ఉండగా ఆ విగ్రహ రూపాన్ని బట్టి పొందే బెనిఫిట్స్ విషయంలో సైతం మార్పులు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.