చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇప్పటివరకు పోటీ చేసిన ప్రతి సందర్భంలో సులువుగానే విజయం సాధించారనే సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు విజయం సాధించడం సులువు కాదు. కుప్పం టీడీపీకి కంచుకోట కాగా ఈ లెక్క మార్చాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కుప్పంకు భారీగా నిధులు మంజూరు చేయడంతో పాటు వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించింది.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో పాటు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడైంది. సీఎం జగన్ కుప్పంలో చంద్రబాబును ఓడించడమే టార్గెట్ గా చేసుకుని ఎన్నికల విషయంలో ముందడుగులు వేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాల్సిన బాధ్యతను జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.
మరోవైపు కుప్పం అభివృద్ధి కోసం చంద్రబాబు పెద్దగా కృషి చేయకపోవడంతో అక్కడి ప్రజల్లో ఆయనపై తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. కుప్పంలో గెలుస్తానో లేదోనని చంద్రబాబు సైతం టెన్షన్ పడుతుండటం గమనార్హం. కుప్పం అభివృద్ధి కోసం జగన్ సర్కార్ ఏకంగా 66 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పదేపదే కుప్పం వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే మాత్రం ఒక విధంగా అది సంచలనం అవుతుందని చెప్పవచ్చు. జగన్ కుప్పంకు సంబంధించి అనుకున్నది సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అవసరమైతే కుప్పం అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో కూడా భారీమొత్తంలో నిధులను రిలీజ్ చేయడానికి సిద్ధం కావాలని జగన్ భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 2024 ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ సత్తా చాటడం ఖాయమని వైసీపీ నేతలు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.