భార్య గురించి జగన్ ఇలా బాధపడటం ఎప్పుడూ చూసి ఉండరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఛార్జ్ షీటులో ఆయన భార్య వైఎస్ భారతి పేరును నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. గురువారం భారతి సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఏడేళ్ల తర్వాత ఆమె పేరును చేర్చింది ఈడీ. ఈ వార్త కొన్ని పత్రికలలో జగన్ అక్రమాస్తుల్లో భారతి కూడా నిందితురాలు అంటూ కధనాలు వచ్చాయి. వీటిపై ట్విట్టర్లో వైఎస్ జగన్ స్పందించాడు. “కొన్ని పత్రికల్లో అక్రమాస్తుల కేసుల్లో నా భార్య ముద్దాయి అంటూ కధనాలు వచ్చాయి. అవి చూసి నేను షాక్ అయ్యాను. కుటుంబాన్ని కూడా వదలని స్థాయికి రాజకీయాలు దిగజారడం చూసి బాధగా ఉంది” అంటూ ట్వీట్ చేసాడు జగన్.

 

 

భారతి సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి ఇదివరకే సిబిఐ మూడు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. అయితే వాటిలో భారతి పేరును చేర్చలేదు. కానీ ఈడీ దర్యాప్తులో ఆమె పేరును ఛార్జ్ షీట్లో ఆమె పేరును నమోదు చేసింది. భారతీ సిమెంట్ కు సంబంధించి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఆమెను ఏ5గా చేర్చారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో భారతిని కూడా ఈ కేసులో చేర్చడం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయ ప్రత్యర్ధులు కుట్ర పన్ని ఇలాంటివి చేస్తున్నారని ప్రతిపక్షాలు దువ్వెత్తిపోస్తున్నాయి.

ఆమె పేరును ఏడేళ్ల తర్వాత ఛార్జ్ షీట్లో చేర్చడంపై వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారతి సిమెంట్స్ పెట్టుబడుల వ్యవహారంలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ రాజకీయ దురుద్దేశంతోనే ఆమెను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆరోపించాడు.. ఈడీ ఆఫీసర్స్ ఉమాశంకర్ గౌడ్, గాంధీలతో టీడీపీకి సత్సంబంధాలున్నాయని, వారి ద్వారానే ఈ విషయం టీడీపీకి లీక్ అయిందన్నారు. లేదంటే యెల్లో మీడియాకి ఈ విషయం ఎలా తెలుస్తుందంటూ ఆయన ప్రశ్నించాడు. టీడీపీకి అనుగుణంగా బీజేపీ ఈ కేసును వాడుకుంటుందని ఆయన అభియోగించాడు.