వైసీపీ ప్రభుత్వానికి ఈ రంగుల పిచ్చి మాత్రం పోదా?

Is this colorful madness enough for the YCP government?

గుంటూరు,ఆంధ్ర ప్రదేశ్ : గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ పంచాయతీ ఆఫీసులకు రంగులు వేసి వైసీపీ ప్రభుత్వం విమర్శల పాలయ్యింది. ఆ తర్వాత దిశ పోలీసు స్టేషన్లకు కూడా వైసీపీ రంగులు వెయ్యడంతో ఆగ్రహించిన కొందరు వేసిన పిటిషన్ ల మీద విచారణ జరిపిన హైకోర్టు వేసిన రంగులని తొలిగించాలని ఆర్డర్ వేసింది. ఆ దెబ్బకి వెంటనే వాటిని తొలగించారు.రంగుల విషయంలో వైసీపీకి హై కోర్టు, సుప్రీమ్ కోర్టులో అక్షింతలు పడిన మరల అదే బుద్ది ప్రదర్శిస్తుందని విమర్శిస్తున్నారు.

Is this colorful madness enough for the YCP government?
Is this colorful madness enough for the YCP government?

నిన్న వై‌ఎస్ జగన్ మోహన్ పుట్టిన రోజు కావున చాలా మంది వైసీపీ కార్యకర్తలు రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ విషయంలో గుంటూరు కి చెందిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.కేంద్ర ప్రభుత్వం శక్తి పేరుతో ప్రతి మహిళా ఎస్‌ఐలకు కేటాయించిన స్కూటీలకు వైసీపీ స్టిక్కర్స్ అంటించి దిశ పేరుతో ఆ వెహికిల్స్ ను గుంటూరు అర్బన్ ఎస్‌పి అమ్మిరెడ్డి పోలీసు స్టేషన్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంబించాడు.అయితే ఈ విషయంపై ఏపీ ప్రతి పక్ష పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఆన్లైన్ దిశ యాప్ కు కూడా వైసీపీ కలరే వేశారు.వైసీపీ పార్టీ రంగులకోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంది. తాము ప్రవేశ పెట్టిన ఏ స్కీమ్ అయిన కానీ ఏ పని అయిన కానీ ప్రజల్లో తమ ఉనికిని కాపాడుకోవాలని వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం చూపించి జగన్ ను విమర్శలపాలు చేస్తున్నారు.ఇలా జరగడం ఇప్పుడు కొత్తేమి కాదు.చివరికి గాంధీ,సాయి బాబా విగ్రహాలకు కూడా వైసీపీ పార్టీ రంగులను వేశారు.