బైసన్ పోలో లో సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. బైసన్ పో లో గ్రౌండ్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ భావించారు. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా వేశారు. అయితే బైసన్ పోలో గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడం మరియు గ్రౌండ్ ఉంటే అందరికి ఆటవిడుపుగా ఉంటుందని పలువురు భావించారు. బైసన్ పోలో లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు పడింది.

కేంద్ర ప్రభుత్వం పరిధిలో భూమి కావడంతో తెలంగాణ సర్కార్ భూమిని అప్పగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కోర్టు పరిధిలో భూమి ఉండడంతో కేంద్రం ఇన్నాళ్లు తప్పించుకుంటూ వచ్చింది. మంగళవారం ఈ కేసును విచారించిన కోర్టు చట్టబద్దమైన భూములను బదలాయించుకోవచ్చని, చట్ట ప్రకారం ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చని తీర్పునిస్తూ పలు కేసులను కొట్టేసింది. తుది విచారణను ఫిబ్రవరి 12 వ తేదికి హైకోర్టు వాయిదా వేసింది. 

 దీంతో బైసన్ పోలో గ్రౌండ్ లో సెక్రటేరియట్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. దీంతో సాధ్యమైనంత త్వరలోనే బైసన్ పోలో గ్రౌండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ, కేంద్రం ఉత్తర్వులు వెలువరుస్తుందని ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని టీఆర్ఎస్ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.