ఏపీలో చిరంజీవి తెలంగాణలో ఎన్టీఆర్.. బీజేపీ రాజకీయం ఇదేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ బలంగా లేకపోయినా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటాలని భావిస్తుండటం గమనార్హం. ఇందుకోసం బీజేపీ స్టార్లపై దృష్టి పెట్టింది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయనే సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికల సమయానికి ఈ పొత్తు ఉంటుందో లేదో క్లారిటీగా చెప్పలేము.

చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలని బీజేపీ కోరుతున్నట్టు గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే గత అనుభవాల వల్ల చిరంజీవి ఈ విషయంలో వెనుకడుగు వేశారని సమాచారం అందుతోంది. మరోవైపు తెలంగాణలో టీడీపీ యాక్టివ్ గా లేకపోవడంతో ఇక్కడ తారక్ యాక్టివ్ కావాలని బీజేపీ కోరినట్టు బోగట్టా. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ ఆ ప్రతిపాదనకు సున్నితంగా నో చెప్పారని తెలుస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలో రజనీకాంత్, మరి కొందరు రాజకీయ నాయకులతో కూడా రాజకీయాలు చేయాలని బీజేపీ భావిస్తుండటం గమనార్హం. ఏ పార్టీలో నేతలు అయినా, సినీ ఆర్టిస్ట్ లు అయినా తమకు బెనిఫిట్ కలుగజేస్తారని అనుకుంటే బీజేపీ వాళ్లపై దృష్టి పెడుతుండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో అనుకూల ఫలితాలు రావాలని బీజేపీ అనుకుంటోంది.

కేంద్రంలో మరో పార్టీ బలంగా లేకపోవడం బీజేపీకి ప్లస్ అవుతోంది. కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే ఈ పరిస్థితికి కారణమని చాలామంది భావిస్తారు. మరికొన్ని సంవత్సరాల పాటు బీజేపీకి కేంద్రంలో ఎదురులేదని చాలామంది భావిస్తున్నారు. కొంతమంది మాత్రం కేంద్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సినీ నేతలు, ఇతర పార్టీల నేతలు బీజేపీకి ప్లస్ అవుతారో మైనస్ అవుతారో చూడాల్సి ఉంది.