రోడ్డుపై వాహనదారులను అడ్డుకుంటున్న అందమైన అమ్మాయిలు.. భయంతో ఊగిపోతున్న జనం..?

సాధారణంగా డబ్బులు సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది కష్టపడి పనిచేసే నిజాయితీగా డబ్బులు సంపాదిస్తే మరి కొంతమంది అన్యాయాలు అక్రమాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఈ కోవకు చెందిన కొంతమంది యువతీ, యువకులు కొత్తదండ ప్రారంభించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది అందమైన యువతులు మన తెలుగు రాష్ట్రాలలో గతంలో రోడ్డు మీద వెళ్లే వాహనదారులను అడ్డుకొని వారిని హింసించి డబ్బులాక్కోవటం కలకలం రేపింది. తాజాగా ఇలాంటి ఘటన మరొకసారి చోటు చేసుకుంది.

ఈ యువతుల గుంపు రాజమండ్రి పరిసర ప్రాంతాలలో సంచరిస్తూ కలకలం రేపుతున్నారు. ఉత్తరాధికి చెందిన 10,15 మంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ ధరించి అందంగా కనిపిస్తూ నిర్మానుష్య ప్రదేశాలు, నగర శివారులలో ఉంటూ రోడ్డు మీద వెళ్లి వాహనదారులను ఆపి విరాళాల పేరుతో ఒక కాగితం ఇచ్చి బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నారు. అలా డబ్బులు ఇవ్వని వారిని దారుణంగా బూతులు తిడుతున్నారు. ఇప్పటివరకు ఇలా ఈ అమ్మాయిల చేతుల్లో బలి అయ్యి ఎంతోమంది డబ్బులు కోల్పోయారు. ఇలా మీరు వాహనదారులను నిలిపి మినిమం 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వని వారిని దారుణంగా బూతులు తిడుతూ రెచ్చిపోవటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

వీరంతా జీన్స్ ప్యాంటు టీ షర్టు ధరించి ఒకే రకమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నారు. వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గతంలో కూడా వీరందరూ తెలుగు రాష్ట్రాలలో సంచరిస్తూ అందరి వద్ద డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులు వారిని మందలించి సొంత ప్రయత్నాలకు తిరిగి పంపించామని.. అయితే వీరంతా మళ్ళీ ఇలా రాష్ట్రం లోకి ప్రవేశించి లాడ్జిలలో ఉంటూ నిర్మానుష్య ప్రాంతాలలో, సిటీ శివార్లలో వెళ్లే వాహనదారులను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ లేడీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.