ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఈ మధ్య మద్యం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంతో మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుంది. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చీప్ లిక్కర్ బ్రాండ్లను రోజుకు నాలుగు కేసులు మాత్రమే అమ్మాలని ఆదేశాలను జారీ చేసింది.
ఈ ఆదేశాలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. ఫలితంగా రోజుకు కేవలం 192 చీప్ లిక్కర్ బాటిళ్లను మాత్రమే విక్రయించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 120 రూపాయలు లేదా 130 రూపాయల ఖరీదు చేసే చీప్ లిక్కర్ ను మాత్రమే అమ్మాలని స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 11 గంటల్లోపు ఒక కేస్ చీప్ లిక్కర్ సాయంత్రం 6 గంటల లోపు మరో మూడు కేసుల చీప్ లిక్కర్ బాటిళ్లను విక్రయించవచ్చు.
అయితే ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మద్యం ప్రియుల జేబుకు చిల్లు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చీప్ లిక్కర్ మద్యం దొరకని పక్షంలో చాలామంది ఖరీదైన మద్యంను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ మద్యం విక్రయాలపై ప్రధానంగా దృష్టి పెట్టడంపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఏపీ సర్కార్ ప్రీమియం బ్రాండ్ల మద్యం కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని ఆ కారణం వల్లే ఈ విధంగా చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చీప్ లిక్కర్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరి కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల విషయంలో జగన్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.