ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది… మరల ఇప్పుడు జగన్ చేస్తున్నారు

ap government all set to resurvey the lands

ఆంధ్ర ప్రదేశ్ : ఏపీ ప్రభుత్వం రీసెంట్ గా సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపధ్యంలో సర్వే జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ల్యాండ్ ఓనర్ కు, రైతుకు టైటిల్ హక్కుతో డిజిటల్ పత్రాలు ఇస్తాం అని ఆయన అన్నారు. సర్వే డివిజన్ నెంబర్ తో పాటు యూనిక్ నెంబర్ ఉంటుంది అని చెప్పారు. ప్రతి స్థలం, పొలంలో పక్కాగా సరిహద్దులో రాళ్లు‌ వేస్తాం అని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ సర్వే ద్వారా మ్యాప్ రూపొందించి అన్ని గ్రామాలకు ఇస్తాం అని ఆయన అన్నారు.అందరూ తమ భూములకు సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చు అని అన్నారు. అప్పటికప్పుడే ఎటువంటి వివాదాలు ఉన్నా పరిష్కారం అవుతాయి అని వెల్లడించారు.

ap government all set to resurvey the lands
ap government all set to re survey the lands

దేశంలోనే ఈ తరహా సర్వే చేయడం తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక‌ పరికరాలతో ఈ సర్వే చేసి డిజిటల్ డాక్యుమెంట్లు అందిస్తాం అన్నారు. రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి కూడా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భూముల రీ‌ సర్వే కోసం ప్రభుత్వం 968 కోట్లు కేటాయించింది అని చెప్పారు.ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఈ‌భూముల సర్వే జరిగింది అన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ఎటువంటి తేడా లేకుండా భూమి హక్కులు నిర్ధారణ జరుగుతుంది అని అన్నారు. ఈనెల 21నుండి 2021 జూన్ వరకు ఈ రీ సర్వే కొనసాగుతుంది అని వెల్లడించారు. జగ్గయ్యపేట పేట మండలం తక్కెళ్లపాడు నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది అని, ఇప్పటి వరకు ఉన్న చాలా భూ‌ వివాదాలు పరిష్కారం అవుతాయి అని చెప్పారు.”నా భూమి ఇది” అనే హక్కు అధికారికంగా కలుగుతుంది అన్నారు. ఎటువంటి అనుమానాలు లేకుండా భూములు కొనుగోలు చేయవచ్చు అని చెప్పారు.