జగన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి – బిజెపిలో తికమక

జగన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి – బిజెపిలో తికమక

ఆంధ్రప్రదేశ్లో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.

ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా బలపడాలని ఉన్న బిజెపికి ప్రస్తుతం ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. వైయస్ జగన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుతో బిజెపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అటు మిత్రపక్షంగా కానీ లేదా శత్రుపక్షంగా కానీ చూడలేక ఉన్నది. అందుకే ఈ తికమక.

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బిజెపి అక్కడ ఉన్న ప్రభుత్వంతో పోరాటం చేయాలి. అయితే ఇప్పుడు బిజెపి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు దెబ్బతీస్తే అది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుంది. అందుకే బిజెపి ఇక్కడ రెండు అంచెల విధానాన్ని పాటిస్తుంది.

ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో స్నేహ పూర్వకంగా కొనసాగటం.  అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులని బీజేపీలోకి లాగేసి బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా తయారవడం.  ఒకసారి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయితే బిజెపి తన రెండవ ప్రణాళికని అమలు పరుస్తుంది. రెండవ ప్రణాళిక ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో క్షేత్ర స్థాయిలోనూ అటు కేంద్ర రాష్ట్ర స్థాయిలోనూ తలపడడం.

అప్పటివరకు బిజెపి నాయకులు రాష్ట్రంలో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సమర్థించడం కానీ విమర్శించడం గాని చేయలేని పరిస్థితి.