అరరె, షన్నూ.. ఏంట్రా ఇది.! ఇంకెప్పుడు ఆడతావురా.!

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌కి సంబంధించి అందరికంటే ఎక్కువగా షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్నూ గురించే ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యింది షో ప్రారంభానికి ముందు నుండీ. హయ్యస్ట్ పెయిడ్ కంటెస్టెంట్.. అని కూడా అతని గురించి ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే వుంది.

పబ్లిసిటీ పీక్స్‌లో వుందంటే, మేటర్ చాలా వీక్‌గా వున్నట్లేనని అర్థం చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఓ గ్యాంగ్ మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు షన్నూ హౌస్‌లో. అంతకు మించి ఇప్పటివరకూ షన్నూ చేసిందేమీ లేదు. దాంతో, సహజంగానే ‘ఏంట్రా షన్నూ ఇది..’ అంటూ అతని మార్కు డైలాగుతోనే ట్రోలింగ్ షురూ అయ్యింది.

సీక్రెట్ నామినేషన్ వ్యవహారంతో, షన్నూ అసలు స్వరూపం బయటపడిపోయింది. మెజార్టీ ఓట్లు ఆయనకే పడ్డాయి.. ఈ వారం ఎలిమినేషన్ కోసం హౌస్‌మేట్స్ నుంచి నామినేషన్ పక్రియలో. అంటే, ఇప్పటిదాకా హౌస్‌లో అందర్నీ షన్నూ మేనేజ్ చేస్తూ వచ్చాడన్నమాట.

ఇకపై నా అసలు పవర్ ఏంటో చూపిస్తానంటూ షన్నూ.. వీరావేశం ప్రదర్శించేశాడు. అన్నట్టు, షన్నూకి బయట బోల్డంత ఫాలోయింగ్ వుంది. ఓట్లు కూడా ఎడాపెడా ఆయనకు అనకూలంగా పడుతున్నాయి. కానీ, ఆట సరిగ్గా లేకపోతే, అభిమానులూ అతన్ని కాపాడలేరు.