ప్రియాంక ఈ పేరు అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్-5 లో కంటెస్టెంట్ గా చేరి ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రియాంక శ్రీకాకుళంలో జన్మించింది. ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ఒక అబ్బాయిగా సాధించలేనిది ట్రాన్స్ జెండార్ గా, ప్రియాంక సింగ్ గా మారి సాధించింది. బిగ్ బాస్ హౌస్ లో ట్రాన్స్ జెండర్ ఎంట్రీ అంటే అందరూ భయపడిపోతారు.సీజన్ 3 లో తమన్నా సింహాద్రి ప్రవర్తనకు చీ కొట్టిన వాళ్లు చాలామంది ఉన్నారు.
సీజన్ ఫైవ్ లో కూడా అలాంటి పరిస్థితి ఎదురు అవుతుందేమో అని భయపడ్డ ప్రేక్షకులకు తన ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకుంది ప్రియాంక. బిగ్ బాస్ హౌస్ లో మానస్ తో లవ్ ట్రాక్ తప్ప ఇంకే కంప్లైంట్స్ లేవు. తన గ్లామర్ తో అందరినీ అలరించింది. అయితే తాను ట్రాంజెండర్ గా మారిన విషయం తన తండ్రికి చెప్పలేదు. బిగ్ బాస్ లో వచ్చిన తర్వాతే తన తండ్రికి కూడా అసలు విషయం తెలిసింది.
తండ్రి కూడా నువ్వు అబ్బాయివేనా లేక అమ్మాయి వైనా పర్వాలేదు నువ్వు సంతోషంగా ఉండి మమ్మల్ని చూసుకుంటావన్న ధైర్యం మాలో ఉంది అంటాడు. ఈ విషయం తెలిసి చాలా ఎమోషనల్ అయింది ప్రియాంక. తన తండ్రి సాయి చాలా బాధలు, కష్టాలు పడ్డాడు. ఇలా అమ్మాయిగా మారిన తర్వాత అయినా తన జీవితం సంతోషంగా ఉంటే బాగుంటుంది అని చెప్పాడు.తల్లిదండ్రులు తనపై నమ్మకం ఉంచి సంతోషంగా ఉండడంపై ఆనందం వ్యక్తం చేసింది ప్రియాంక.
ప్రియాంక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లి పనులు కూడా మొదలు పెట్టామని తన హల్ది కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. మొత్తం మీద అబ్బాయి అమ్మాయిగా మారి ఇలా పెళ్లి చేసుకోవడంపై నిటిజన్లు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. కాబోయే వరుడు ఎవరో తెలియాలంటే పెళ్లి అయ్యేవరకు వేచి చూడాల్సిందే