బిగ్ బాస్ తెలుగు మూడవ వారం ఎలిమినేషన్ ట్విస్ట్… ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

దేశవ్యాప్తంగా అతిపెద్ద రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ షో తెలుగులో కూడా ప్రసారమవుతు ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల సెప్టెంబర్ 4వ తేదీ సీజన్ 6 కూడా ప్రారంభమైంది. ఇప్పటికే రెండు వారాల్లో పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం మూడవ వారం కొనసాగుతోంది. ఇక ఈ వారంలో కూడా ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇక ఈవారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ గురించి రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఎలిమినేషన్ విషయంలో మాత్రం ముందే లీక్ చేసేస్తున్నారు. ఇక ఇలా రివ్యూవర్లు లీక్ చేసిన సమాచారం ప్రకారం.. మూడవ వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లే కంటెస్టెంట్లలో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా వినిపించే పేరు ఇనయ సుల్తానా. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇనయా సుల్తానా బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలో హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే అందరితో గొడవ పడుతూ వివాదంలో చిక్కుకుంటుంది.

ఇక ఈ వారంలో కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో భాగంగా రేవంత్, శ్రీహన్ తో భారీగా గొడవ పడింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో ఈ వారం ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా ఇనయా ఒంటరిగా పోరాటం చేసింది. అయితే మూడవ వారంలో నామినేషన్స్ లో ఉన్న ఇనయా ఎలిమినేట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో చురుగ్గా పాల్గొంటూ అందరికీ గట్టి పోటీ ఇస్తున్న ఇనయా ఎలిమినేట్ అవ్వటం ఏంటి అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే వారిలో ఇనయాతో పాటు నేహా చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. దీంతో ఇనయా అభిమానులు కొంతవరకు రిలాక్స్ అయ్యి.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో పార్టిసిపేట్ చేస్తూ అందరితో గొడవపడే ఇనయాని ఎలిమినేట్ చేయటం కన్నా నేహా చౌదరిని ఎలిమినేట్ చేయడం ఉత్తమం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అన్న సంగతి తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.