Bigg Boss Telugu: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. ప్రియుడితో ఎంగేజ్మెంట్.. ఫొటోస్ వైరల్?

Bigg Boss Telugu: తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో శుభశ్రీ రాయగురు కూడా ఒకరు. ఈమె సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో తన గ్లామర్ షో చేస్తూ బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా అమర్ దీప్ తో జరిగిన గొడవతో బాగా ట్రెండ్ అయిందని చెప్పాలి. కానీ ఊహించని విధంగా తక్కువ సమయంలోనే షో నుంచి బయటకు వచ్చేసింది.

బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ సినిమాలు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా ఖాతాలో ఊహించిన విధంగా తన ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ షేర్ చేసింది. తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నట్లు అభిమానులకు తెలియజేసింది.

దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. కొంతమంది ఇదేంటి సర్ప్రైజ్ అంటూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో శుభశ్రీకి కాబోయే భర్త గురించి తెగ ఆరా తీస్తున్నారు. వరుడు ఎవరు ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అతడి పేరు అజయ్ మైసూర్.. అలియాస్ ఏజే మైసూర్. ఏజే మైసూర్ సినీరంగంలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే అటు నిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు. శుభ శ్రీ రాయగురు, ఏజే మైసూర్ కలిసి ఇటీవల మెసెస్టీ ఇన్ లవ్ అనే కవర్ సాంగ్ కూడా చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు. జూన్ 5న వీరిద్దరి నిశ్చితార్థ వేడక జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శుభశ్రీ రాయగురు తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది కంగ్రాట్యులేషన్స్ అని చెబుతూనే పెళ్లి ఎప్పుడూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.