బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి హ్యాండ్ ఇచ్చిన స్టార్ కమెడియన్.. మరొకరి వేటలో బిగ్ బాస్..?

ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతోంది. ఇప్పటివరకు పూర్తి అయిన ఐదు బిగ్ బాస్ సీజన్ లకి మంచి రేటింగ్స్ రావటంతో ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభించారు. అయితే ఈ ఆరవ సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే రేటింగ్స్ దారుణంగా ఉన్నాయి. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బిగ్ బాస్ వివిధ రకాల టాస్కులు ఇవ్వటమే కాకుండా కంటెస్టెంట్ల చేత కామెడీ పండించేలా ప్రయత్నాలు చేస్తోంది.

అయినప్పటికీ ఈ ఆరవ సీజన్ రేటింగ్స్ అంతంత మాత్రమే ఉండటంతో బిగ్ బాస్ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఎన్నోసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన ఆ వారంలో కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు ఆట విషయంలో బాగా పోటీ పడినప్పటికీ.. మరొక వారానికి యధావిదంగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఈ ఆరవ సీజన్ రేటింగ్ ప్రతి వారానికి తగ్గిపోతూనే ఉంది. రేటింగ్ ఇలాగే కొనసాగితే కష్టమని భావించిన బిగ్ బాస్.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక మంచి కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించాలని భారీగా ప్లాన్ చేశారు.

ఈ క్రమంలో జబర్దస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన సుధీర్ ని బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని భావించారు. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం సుధీర్ ని సంప్రదించగా అతను కూడా అంగీకరించినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా బిగ్ బాస్ లో సుధీర్ ఎంట్రీ గురించి మరొక వార్త వైరల్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వటానికి సుధీర్ నిరాకరించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆహా లో ప్రసారం కానున్న కామెడీ షో లో సుధీర్ లీడ్ రోల్ చేస్తున్నాడు. అందువల్ల బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుధీర్ హ్యాండ్ ఇవ్వటంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం బిగ్ బాస్ మళ్ళీ వేట మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.