బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పిన సూర్య.. విజేత గురించి జోస్యం చెప్పిన సూర్య?

బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం నేటితో 11 వారాలను పూర్తి చేసుకోనుంది. ఇలా ఈ కార్యక్రమం 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాగా ఇప్పటికే 11 మంది బయటకు వెళ్లారు. బిగ్ బాస్ కార్యక్రమం నుంచి 8 వ వారం ఆర్ జె సూర్య ఎలిమినేట్ అయ్యారు.ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు రాగానే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా రేవంత్ శ్రీహాన్ గీతు ఫైమా ఆదిరెడ్డి ఉంటారని చెప్పారు. అయితే గీతు ఊహించని విధంగా తొమ్మిదవ వారం ఎలిమినేట్ అయ్యారు.

ఇకపోతే తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన టాప్ 5 కంటెస్టెంట్ ల గురించి అలాగే బిగ్ బాస్ విన్నర్ గురించి జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే సూర్య మాట్లాడుతూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా
రేవంత్ శ్రీహాన్ గీతు ఉంటారని భావించాను అయితే గీతు ఎలిమినేట్ అయ్యి ఆ స్థానంలోకి ఇనయ వచ్చిందని తెలిపారు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా రేవంత్ గెలుస్తారని ఈయన జోస్యం చెప్పారు.తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అలాగే నాగార్జున గారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాను.

ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బయట రేవంత్ కుఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే ఆయనే విన్నర్ అవుతారని అనిపిస్తోంది అంటూ బిగ్ బాస్ విన్నర్ గురించి సూర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్నటువంటి రేవంత్ కాస్త ఆగ్రెసివ్ నెస్ తగ్గించుకుంటే తప్పకుండా ఈయన విన్నర్ అవుతారని సూర్య బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.