బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగనుందనే విషయానికి వస్తే …రిషి అందరికీ ఫోన్ చేసి తప్పకుండా రావాలని చెబుతాడు జగతి మేడం మీరు కూడా రావాలి అనడంతో జగతి సంతోషపడుతుంది. ఇలా జగతి మహేంద్రా సంతోషపడి మహేంద్ర మాట్లాడుతూ అక్కడికి వెళ్లాలంటే ఏవో అని తీసుకెళ్లాలి కదా ఆ ఏర్పాట్లు అన్నీ చూడండి అని వెళ్లిపోతారు. దేవయాని మాత్రం చాలా మండిపోతుంది.హోటల్ గదిలో రిషి వసుధార ఫోటోని చూస్తూ ఎంతో సంతోష పడుతూ ఉంటాడు నువ్వు ఒక అద్భుతం నువ్వు నా జీవితంలోకి వచ్చాక చాలా అద్భుతాలు జరిగాయి అంటూ తనని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అంతలోపే రాజీవ్ అక్కడికి వెళ్లి డోర్ కొట్టడంతో కాఫీ ప్లీజ్ అని అడుగుతాడు. వెంటనే రాజీవ్ కాఫీ మాత్రమే చాలా ఇంకా ఏమైనా కావాలా రిషి సార్ అనడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఇలా హోటల్ గదిలో తాను వసుధార మెడలో తాళికట్టబోతున్నాను అని రాజీవ్ మాట్లాడటంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడకు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు ఇలాగే మాట్లాడవంటే నిన్ను కొట్టినా కొడతాను రిషి వార్నింగ్ ఇచ్చి తనని బయటకు దొబ్బుతాడు.. దీంతో వసుధార మెడలో తాళి చూసిన తర్వాత అయినా నమ్ముతారేమో అని అక్కడి నుంచి రాజీవ్ వెళ్లిపోతాడు. మరోవైపు చక్రపాణి సుమిత్ర తో మాట్లాడుతూ కూతురు పెళ్లి చేసే విషయంలో ఏది మంచో ఏది చెడు ఆలోచించాల్సిన అవసరం లేదా అని ప్రశాంతంగా మాట్లాడటంతో సుమిత్ర ఇందాకే నాకు అమ్మాయి అబ్బాయి ఫోటో చూపించింది చాలా బాగున్నాడు అని మాట్లాడటంతో ఏంటి కూతురికి వత్తాసు పలుకుతున్నావా అంటూ మరోసారి తనపై కోప్పడతాడు.
ఇక గదిలో వసుధార జగతి మేడం పంపించిన గిఫ్ట్ తెరిచి చూస్తుంది అందులో మంగళసూత్రం ఉండడంతో చాలా సంతోషపడుతుంది.మరోసారి చక్రపాణి వసుధార మధ్య ఇదే విషయం గురించి గొడవ జరుగుతుంది అంతలోపు జగతి ఫోన్ చేయడంతో చక్రపాణి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వసుధార అక్కడంతా మంచిగానే ఉంది కదా అనడంతో చక్రపాణి జగతి పట్ల నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతాడు అప్పటికి జగతి చక్రపాణి గారు నేను చెప్పేది వినండి అంటూ ప్రశాంతంగా మాట్లాడిన చక్రపాణి మాత్రం టీచరమ్మ ఇదంతా నీ స్కెచ్ అంటూ దారుణంగా అవమానిస్తాడు.
జగతి ఫోన్లో మాట్లాడుతూ రిషి ఏమి ఊరు పేరు లేని వాడు కాదు అతను డి బి ఎస్ టి కాలేజ్ మేనేజర్ అంటూ మాట్లాడటంతో చక్రపాణి షాక్ అవుతారు జగతి పట్ల కూడా చాలా వెటకారంగా మాట్లాడతారు. నీ మొగుడెవరో నీ సంసారం ఏదో మీ ఊరు ఏంటో నీకే తెలియదు ఎవడినో పిలుసుకొచ్చి నా కొడుకు అని చెప్పి నా కూతురు గొంతు కోస్తావా అనడంతో చక్రపాణి గారు మర్యాదగా మాట్లాడండి రిషి ఎవరనుకున్న తను నా కన్న కొడుకు అంటి జగతి మాట్లాడటంతో చక్రపాణి షాక్ అయ్యి తను నీ కన్నా కొడుకు అయితే నీ పెళ్ళికి అసలు ఒప్పుకొనంటూ షాక్ ఇస్తాడు.