రిషిని కూల్ చేసే పనిలో వసు…. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి వసుధారను తప్పుకోమన్న రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ గత ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే రిషి వసుధార ఇద్దరు కూడా మాట్లాడుతూ తనని తన వద్దకు రావద్దని చెబుతాడు అలాగే వసుధార చెప్పేది తాను ఏమీ వినదల్చుకోలేదని చెబుతాడు.మరోవైపు జగతి మహేంద్రా ఇద్దరు కూడా వసుధార ఎందుకు ఇలా చేస్తుంది. ఒకవేళ పెళ్లి చేసుకుంది మరి ఇక్కడకు వచ్చి రిషి ని ఎందుకు బాధ పెడుతుందని మాట్లాడుతూ ఉంటారు.జగతి వసుధార మనకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అంటూ మహేంద్ర చెప్పగా ఏం చెబుతుంది మహేంద్ర అలా జరిగింది ఇలా జరిగింది అంటూ తన తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది అంటూ జగతి మాట్లాడుతుంది.

మరోవైపు రిషి దగ్గర నుంచి వసుధార బయటకు రావడంతో అదే సమయంలో తనకు దేవయాని ఎదురుపడుతుంది. ఇక వీరిద్దరి మధ్య మాట కొనసాగుతూ ఒకరికొకరు చాలెంజ్ విసురు కుంటారు. అలాగే రాజీవ్ కూడా కాలేజీలోకి వచ్చి వసుధారకు తన మాటలతో విసుగు తెప్పిస్తాడు.దీంతో గత ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా రిషి తలనొప్పితో బాధపడుతూ సోఫాలో అలాగే కూర్చుండి పోతాడు.

వసుధార రిషికి బాంబ్ రాస్తూ తన తల మర్దన చేస్తూ ఉంటుంది.అయితే తన చేతులు పట్టుకొని రిషి కళ్ళు తెరిచి చూడగా వసుధార ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు అనడంతో నా మనసు చెప్పింది సర్ అంటూ వసుధార మాట్లాడుతుంది. మనసు గురించి నువ్వు మాట్లాడకపోవడమే మంచిది వసుధార. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా నువ్వు తప్పుకో అంటూ రిషి వసుధారకు షాక్ ఇస్తాడు.రిషి ఇలా మాట్లాడటంతో వసుధార మీరే నన్ను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా నియమించారు సార్ అని చెప్పడంతో రిషి గతంలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా మేడం తర్వాత నువ్వే ఆ అర్హతలను కలిగి ఉన్నావు అంటూ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటారు.మీరే నన్ను ఈ ప్రాజెక్టు హెడ్గా తొలగించండి సర్ అంటూ వసుధార కూడా మాట్లాడుతుంది. దీంతో ఈ ప్రోమో పూర్తి అవుతుంది మరి ఈ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.