రిషిని నీడలా వెంటాడుతున్న వసుధార…. తనని వదిలి వెళ్లిపొమ్మన్న రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పేడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక గత ఎపిసోడ్లో భాగంగా వసుధార తాను పెళ్లి చేసుకోలేదని తన మెడలో తాళి తానే వేసుకున్నానని చెప్పడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. దీంతో ఎలాగైనా ఈ నిజం రిషి సార్ కి చెప్పాలని భావించిన వసుధారా రిషి వద్దకు వెళుతుంది. అయితే రిషి తనని వదిలి వెళ్లిపోవాలని చెబుతాడు.

ఇక చక్రపాణి వసుధార వద్దకు వచ్చి తాను రిషి సార్ ని కలిసి విషయం మొత్తం చెబుతాను నేను చేసిన తప్పుకు క్షమాపణలు అడుగుతానని ఎమోషనల్ అవుతారు. నిన్ను రిషి సార్ పక్కన చూడాలని కోరికగా ఉంది నాకు రిషి సార్ ని చూపించమ్మా అంటూ ప్రాధేయపడతాడు. ఇలా చక్రపాణి వసుధార మాట్లాడుతూ ఉండగా చక్రపాణి వసుధార చాలా ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టు అని అడగడంతో ఈ మాటలలో పడి ఆ విషయమే మర్చిపోయాను నాన్న అంటూ వసు మాట్లాడుతుంది. ఇంతటితో గత ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే తాజాగా ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా రిషి రాత్రి నడుచుకుంటూ వెళుతూ ఉండగా వసుధార కూడా రిషి వెనక నీడలా తనని వెంటాడుతూ ఉంటుంది. అయితే తన వెనుక ఎవరో వస్తున్నారని నీడను చూసి గ్రహించిన రీషి ఆగిపోతారు.రిషి ఆగిపోవడంతో వసుధార వెనక్కి వెళ్లిపోగా రిషి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయ్ వసుధారా అంటూ తనని పిలుస్తారు.వసుధార ముందుకు రావడంతో నన్ను ఎందుకు ఇలా వెంటాడుతున్నావ్ వెళ్ళిపో వసుధారా అంటూ సీరియస్ అవుతాడు.

ఇలా వసుధారపై సీరియస్ అయిన రీషి ముందుకు వెళ్లి ఒక బెంచ్ వద్ద కూర్చొని కప్పులోకి రాళ్లు విసురుతూ ఉంటాడు. అదే సమయంలో వసుధారా కూడా అక్కడికి వెళ్లి కూర్చుంటుంది. ఇంతటితో ఈ ప్రోమో పూర్తి అవుతుంది. మరి నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరగబోతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.చక్రపాణి వెళ్లి రిషిని కలుస్తాడా లేక రిషి వసుధారకు మాట్లాడే అవకాశం ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.