ఫైమా కి సర్పర్ గిఫ్ట్ ఇచ్చిన పటాస్ ప్రవీణ్… ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

జబర్దస్త్ లేడీ కమెడియన్ పాపులర్ అయిన ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటగా ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కామెడీ షోలో పాల్గొని గుర్తింపు పొందిన ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకుంది. ఇక జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీం లో చేస్తూ తనదైన శైలిలో పంచులు, సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా జబర్దస్త్ కి వచ్చిన కొంతకాలానికి లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. జబర్దస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగులో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం తగ్గించుకుంది.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఫైమా అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను కూడా నవ్వించింది. అంతేకాకుండా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో కూడా చురుగ్గా పాల్గొంటూ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చింది. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న ఫైమా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఉంటుందని ఆమె అభిమానులు చాలా ధీమాగా ఉండేవారు. అయితే ఆమె చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇటీవల ఆమె ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఫైమా కి ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

ఈ క్రమంలో ఆమెను ఓపెన్ టాప్ కార్ లో ఎక్కించుకొని హైదరాబాద్ వీధుల్లో సందడి చేశారు. ఇక ఫైమా తో పాటు జబర్దస్త్ లో కమీడియన్ గా గుర్తింపు పొందిన పటాస్ ప్రవీణ్ కూడా ఫైమాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. అయితే వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఫైమా కి ప్రవీణ్ గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఆమె చేత కేక్ కట్ చేయించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో జరిగిన విశేషాల గురించి ఆసక్తికర విషయాలను చర్చించుకున్నారు. ఇక ఈ క్రమంలో తన మెడలో ఉన్న బంగారు గొలుసుని పైమా మెడలో వేసి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Special gift తో grand welcome చేసిన Patas Praveen Jabardasth Faima | Bigg Boss6 | Falaknama Faima