అమ్మాయిల విషయం మామ ముందే బయట పెట్టిన లోకేష్.. చంద్రబాబు రియాక్షన్ ఏంటో తెలుసా..?

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షో ఆహాలో ప్రసారమై మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ షో మంచి హిట్ అవడంతో ఇటీవల అండ్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు. ఈ సీజన్ 2 లో కూడా బాలకృష్ణ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పాల్గొనె సెలబ్రిటీలతో బాలకృష్ణ వ్యవహరించిన శైలి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో సీజన్ 2 మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎట్టకేలకు అక్టోబర్ 14వ తేదీన అండ్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం అయింది.

ఈ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అతని తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు. ఇలా తన వియ్యంకుడిని, అల్లుడిని రియాలిటీ షో కి తీసుకువచ్చి బాలకృష్ణ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇటీవల విడుదలైన ప్రోమో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. దీంతో తాజాగా ఆహా లో స్ట్రీమ్ అవుతున్న మొదటి ఎపిసోడ్ పై పేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ షో లో చంద్రబాబు బాలకృష్ణ మధ్య జరిగిన సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ షోలో చంద్రబాబు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను బాలకృష్ణ బయటకు రాబట్టాడు.

ఇక బాలకృష్ణ ఈ ఎపిసోడ్ లో తన అల్లుడి వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నలు అడిగి ఆసక్తికర సమాధానాలు బయటికి రాబట్టాడు. ఈ క్రమంలో అమ్మాయిల మ్యాటర్ గురించి మామ ముందే చాలా సరదాగా మాట్లాడారు. గతంలో కాలేజీలో చదువుకునే రోజుల్లో విదేశాల్లో గర్ల్ ఫ్రెండ్స్ కలిసి స్విమ్మింగ్ పూల్‌ లో ఎంజాయ్ చేస్తున్న అల్లుడి ఫోటో బయటపెట్టి.. ఇది అసెంబ్లీ వరకు వెళ్లిందంటూ బాలయ్య బాబు చురకలంటించారు . కాలేజీ రోజుల్లో అలా ఉండకపోతే ఎలా ఉంటారు అంటూ నారా లోకేష్ చాలా రొమాంటిక్ గా సమాధానం చెప్పాడు. ఇక ఈ విషయంపై మీ స్పందన ఏంటి? అని చంద్రబాబుని అడగ్గా.. మామకి అమ్మకు లేని సందేహం నాకెందుకు అంటూ సమాధానం చెప్పాడు.