బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పదవ వారం కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు పాము నిచ్చెన టాస్కు ను ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా అమ్మాయిలు కూడా గట్టిగానే పోరాడినట్టు కనిపిస్తోంది. కాగా హౌస్ లో ఉన్న సభ్యులు కొందరు కంటెస్టెంట్స్ వెళ్లి పాములు కట్టాల్సి ఉండగా మరి కొంతమంది మట్టితో నిచ్చెన ను కట్టాలి అని ఆదేశించాడు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా రేవంత్ మొత్తం మట్టిని తీసుకెళ్లడంపై ఇతర కంటెస్టెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు రేవంత్ ఒకరికి కూడా మట్టిని ఇవ్వను అని గట్టిగా చెప్పేసాడు.
అప్పుడు ఆదిరెడ్డి మొత్తం తెచ్చుకుంటే ఎలా బ్రో అని ప్రశ్నించగా అది నా ఇష్టం బ్రో సమాధానం ఇచ్చాడు. నేను ఎవరి నుంచి లాక్కోలేదు గేమ్‌లో భాగంగానే తీసుకున్నాను కదా అని సమాధానం ఇచ్చాడు. అయితే నిచ్చెన కట్టమని చెప్పినా కంటెస్టెంట్స్ ఇచ్చిన కట్టడం కోసం గట్టిగానే పోరాడారు. కాగా టాస్క్ మధ్యలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. పాము శబ్దం వినపడినప్పుడు మాత్రమే వెళ్లి మట్టి తీసుకోవాలి అని చెప్పాడు. మొదట కీర్తి పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరకు వెళ్ళగా అతనిని టార్గెట్ చేసి మట్టి తీసుకోవాలని శక్తికి మించి పోరాడింది.
ఇక టాస్క్ లో భాగంగానే శ్రీ సత్య, వాసంతిలు ఒకరినొకరు తోసుకుంటూ టాస్క్ విషయంలో గట్టిగా పోరాడారు. శ్రీ సత్య ని పలువురు కంటెస్టెంట్లు సపోర్ట్ చేసినప్పటికీ వాసంతినే శ్రీ సత్య కంటే బాగా ఆట ఆడింది. అప్పుడు కీర్తి చెయ్యి నొప్పిగా ఉన్నప్పటికీ ఆటలో ఆడే ప్రయత్నం చేసింది. ఇక టాస్క్ లో భాగంగా కీర్తి తన చెయ్యి నొప్పి కారణంగా తట్టుకోలేక ఆట ఆడ లేక పోతున్నాను అంటూ ఎమోషనల్ అయింది. కీర్తి చెయ్యి నొప్పి కారణంగా ఎమోషనల్ అవడంతో అక్కడే ఉన్న కంటెస్టెంట్లు అందరూ ఒక్కసారిగా కీర్తి దగ్గరికి చేరుకున్నారు.