బిగ్ బాస్ ఎనిమిదవ వారం ఎలిమినేషన్.. బ్యాడ్ బాయ్ ల ముద్రవేసి పంపుతున్నారుగా..?

నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇటీవల ప్రారంభమై ఇప్పటికే 7 వారాలు పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎనిమిదవ మారం చివరి ఎపిసోడ్ కొనసాగుతోంది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 6 మునుపటి సీజన్ లో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ఎందుకు జరుగుతున్నాయో కూడా ప్రేక్షకులకు అర్థం కాకుండా తయారవుతుంది. ఆట ఆడకుండా కాలక్షేపం చేసే వారిని హౌస్ లో ఉంచి ఆట ఆడే వారిని బయటకి పంపుతున్నారు.

తాజాగా 8వ వారంలో జరిగిన ఎలిమినేషన్ లో కూడా అదే రిపీట్ అయిందని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో ఎవరయితే, బాగా ఆడుతు.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారని అనుకునెలోపే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేస్తున్నారు. ఇక ఈ ఎనిమిదవ వారంలో ఆర్ జె సూర్య బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే అందరిలా కాకుండా బిగ్ బాస్ వల్ల సూర్య బ్యాడ్ బాయ్ అనే బిరుదు తగిలించుకొని బయటికి వస్తున్నాడు.

బిగ్ బాస్ హౌజ్ లో సూర్య ఒక మంచి ఆటగాడు. కానీ ఆరోహి, ఇనయతో పులిహోర కలిపి ప్రేమాయణం సాగించాడు . దీంతో సూర్యకి పులిహోర రాజ అనే బిరుదు ఇచ్చి బయటికి పంపుతున్నారు. అయితే బిగ్‌బాస్ కావాలనే సూర్యని ఇలా బ్యాడ్ బాయ్ లా ప్రొజెక్ట్ చేశాడని ప్రేక్షకులకు తెలుసు. అందువల్ల బిగ్ బాస్ హౌజ్ లో ఉండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బ్యాడ్ బాయ్ ల ప్రేక్షకుల ముందు ప్రొజెక్ట్ చేసి బయటికి గెంటేస్తున్నారు అంటూ సూర్య అభిమానులు బిగ్ బాస్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.