ఫ్రెండ్స్ తో కలిసి చిందులు వేస్తున్న అషురెడ్డి.. మీ ఇంట్లో వాళ్ళు వదిలేసారా అంట నెటిజన్స్ కామెంట్స్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట సోషల్ మీడియాలో డబ్స్మాష్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అషు ఆ తర్వాత తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. బుల్లితెర తెరపైకి ఎంట్రీ ఇచ్చి పలు షోలలో ఈవెంట్ లలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు జూనియర్ సమంత గా కూడా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. రోజురోజుకీ తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ తనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి లండన్ లో తన స్నేహితులతో కలిసి డాన్స్ చేసిన వీడియో ఒకటి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. కాగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అషు తన ఫ్రెండ్స్ తో కలిసి హో జాయేగి బల్లే బల్లే అనే హిందీ పాటకు స్టెప్పులేసింది.

పొట్టి స్కర్ట్ లో థైస్ అందాలను చూపిస్తూ హాట్ హాట్ క్లీవేజ్ షో చేస్తూ అందాలతో యువతని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ పొట్టి స్కర్ట్ లో డ్యాన్స్ చేస్తూ ఇబ్బంది పడింది అషు. మధ్య మధ్యలో డ్రెస్సును సరిచేసుకుంటూ దోస్తులతో కలిసి చిందులు వేసింది. కాగా ఆ వీడియో వైరల్ అవడంతో నెటిజన్స్ అషు పై ఫైర్ అవుతున్నారు. ఆ డ్రెస్ ఏంటి అషు? మీ ఇంట్లో వాళ్లు నిన్ను పట్టించుకోవడం లేదా? నువ్వే వాళ్లని వదిలేశావా? అంటూ అషు పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్. ఇంకొక నెటిజన్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత నిన్ను అన్ ఫాలో అవుతున్నాను గుడ్ బాయ్ అంటూ కామెంట్స్ లో రాసుకొచ్చింది.