Mahesh Fans: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మొట్టమొదటిసారిగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది.ఈ క్రమంలోనే మొదటిసారిగా ఈ పాటలో నటించడంతో ఈమె ఎంతో బోల్డ్ స్టెప్పులతో స్కిన్ షో చేస్తూ కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాట విడుదలైన అతి తక్కువ సమయంలోనే 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అదేవిధంగా ఈ పాటలో మగాళ్ళ వ్యక్తిత్వం గురించి అవమాన పరిచినట్లు లిరిక్ రాశారని ఆ లిరిక్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కొందరు ఈ విషయం పై వ్యతిరేకత తెలుపుతూ కేసు వేశారు.
ఇది కాకపోతే ఈ సినిమాలో సమంత చేసిన ఈ డాన్స్ పై మహేష్ అభిమానులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అందుకు గల కారణం గతంలో మహేష్ బాబు నెంబర్ వన్ నేనొక్కడినే చిత్రంలో హీరోయిన్ కృతిసనన్ ఎలాగైనా మహేష్ బాబును తనవైపుకు తిప్పుకుని ప్రేమించేలా చేయాలనే ఈ విధంగా ఆమె పాత్రను చూపించారు. ఈ క్రమంలోనే ఒక పాటలో మహేష్ బాబు బీచ్ దగ్గర నడుస్తూ వెళ్తుండగా కృతిసనన్ అతని అడుగులను చేతితో తాకుతూ చూపించారు.
ఈ విషయంపై అప్పట్లో పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఒక అబ్బాయికి అమ్మాయిని మరి ఇంతగా బానిస చేయాలా అంటూ సింగర్ చిన్మయి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే మరికొందరు మహిళలు సైతం ఈ విషయంపై ఆమెకు మద్దతు తెలిపారు. అలా మద్దతు తెలిపిన వారిలో సమంత కూడా ఒకరు. ఇలా అప్పుడు మహేష్ బాబు విషయంలో దీనిని తప్పుగా పరిగణించారు. కానీ ప్రస్తుతం సమంత నటించిన ఐటమ్ సాంగ్ లో మాత్రం సమంత ఒక మేల్ డాన్సర్ గుండెపై కాలు పెట్టి డాన్స్ చేసింది. మరి ఇది మగజాతినీ అవమానించినట్టు కాదా? మరి నువ్వు చేసింది తప్పు కాదా సమంత? అంటూ మహేష్ ఫ్యాన్స్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నకు సమంత ఏమని సమాధానం చెబుతుందో వేచి చూడాలి.