Varun Tej: తమన్ ను దేవిశ్రీ అంటూ పిలిచిన వరుణ్ తేజ్… వైరల్ అవుతున్న నెటిజన్స్ కామెంట్స్..!

Varun Tej: ప్రస్తుతం టాలవుడ్ లో దేవి శ్రీ ప్రసాద్, తమన్ హవా నడుస్తోంది. టాలీవుడ్ లో పెద్ద సినిమా స్టార్ట్ అయింది అంటే దానికి కచ్చితంగా వీరిద్దరిలో ఎవరో ఒకరు సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇటీవల సంగీతం అందించిన భీమ్లా నాయక్ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న “గని” సినిమాకి కూడా తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను అల్లు అరవింద్ బ్యానర్లో అల్లు బాబీ, సిద్దు మొద్దు నిర్మించారు.

గని సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విజయవాడలో ఈ సినిమా నుండి “రోమియో జూలియట్” పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు.ఇక వరుణ్ తేజ్ తమన్ గురించి మాట్లాడుతూ..” ద తమన్ రాక్ స్టార్.. మంచి మ్యూజిక్ ఇచ్చేవారు ఎవరైనా రాక్ స్టార్. తమన్ టెన్షన్ పడతాడు కానీ పాట మాత్రం అదరకొడతాడు”.అంటూ తమన్ నీ పొగిడాడు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తమన్ గురించి వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలకు నెటిజన్లు కామెంట్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే రాక్ స్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నా తమన్ వరుసగా సినిమాలకు సంగీతాన్ని అందిస్తారు నిత్యం బిజీగా ఉంటున్నాడు. ఇండస్ట్రీలో తమన్, దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరూ ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ ప్రేక్షకులకు మంచి సంగీతాన్ని అందిస్తున్నారు.