ప్చ్.. ఇప్పటికీ వంటలక్కను దాటలేకపోతున్న బిగ్ బాస్ షో.. ఇలా అయితే కష్టమే?

again karthika deepam serial dominates bigg boss

బుల్లితెర మీదనే మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్. కానీ.. రోజూ ప్రసారమయ్యే.. సాగ…దీసే సీరియళ్లను మాత్రం దాటలేకపోతోంది. ఎంత కష్టపడ్డా.. కనీసం టాప్ 5లో కూడా బిగ్ బాస్ షో ఉండలేకపోతోంది. బార్క్ డేటా చూస్తేనయితే.. బిగ్ బాస్ షో కంటికి కూడా కానరాకుండా పోతోంది.

again karthika deepam serial dominates bigg boss
again karthika deepam serial dominates bigg boss

కానీ.. బిగ్ బాస్ యాజమాన్యం, హోస్ట్ నాగార్జున మాత్రం బిగ్ బాస్ షో.. టీఆర్పీలో దూసుకుపోతోందని చెప్పుకుంటున్నారు. నెంబర్ వన్ చానెల్ అంటున్నారు. దేశంలోనే నెంబర్ వన్ జీఈసీ చానెల్ అన్నారు. కానీ.. బార్క్ రేటింగ్స్ లో చూస్తే బిగ్ బాస్ షోనే ఎక్కడా కనిపించడం లేదు.

అక్టోబర్ 10, 2020 నుంచి అక్టోబర్ 16, 2020 వరకు డేటా తీసుకున్నా కూడా స్టార్ మా 5వ స్థానంలో ఉంది. అయితే.. ఏపీ, తెలంగాణలో మాత్రం స్టార్ మానే నెంబర్ వన్. ఇక.. ప్రోగ్రామ్స్ విషయంలో అత్యధిక ఇంప్రెషన్స్ వచ్చిన ప్రోగ్రామ్ లో కార్తీక దీపం సీరియల్ ఉండగా.. తర్వాత అదే స్టార్ మాకు చెందిన ఇంటింటి గృహలక్ష్మి, వదినమ్మ సీరియళ్లు నిలిచాయి.

again karthika deepam serial dominates bigg boss
again karthika deepam serial dominates bigg boss

అయితే.. గత వారం జెమినీ టీవీలో సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రదర్శించగా.. ఆ సినిమా 4వ స్థానంలో నిలిచింది. 5వ స్థానంలో మళ్లీ స్టార్ మాకే చెందిన దేవత సీరియల్ నిలిచింది.

మరి.. కఠినమైన టాస్కులు ఇచ్చినా.. హోస్ట్ గా నాగార్జున వీకెండ్ షోలలో వచ్చి షోను ఎక్కడికో తీసుకుపోతున్నా కూడా.. బిగ్ బాస్ షో ఎందుకని ప్రేక్షకులకు నచ్చడం లేదు. ప్రేక్షకులు బిగ్ బాస్ షోను ఎందుకు తిరస్కరిస్తున్నారు. కనీసం వంటలక్కను కూడా ఎందుకు బీట్ చేయలేకపోతోందో?