NTR 30 : ఎన్టీఆర్ కి ఏమయ్యింది?? అందుకే షూటింగ్ కి దూరం అట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రానున్న రోజుల్లో పలు భారీ సినిమాలు రాబోతున్నాయి ఆ చిత్రాల్లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ప్లాన్ చేస్తున్న సినిమాపై అయితే మరిన్ని అంచనాలు నెలకొనగా..

ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ నెవర్ బిఫోర్ మాస్ సినిమాగా దీన్ని ప్లాన్ చెయ్యగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్టీఆర్ ఎప్పుడు సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడు అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా చూస్తుండగా మరికొన్నాళ్లు వారికి ఎదురు చూపులు తప్పవని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే షూటింగ్ లో పాల్గొనే మూడ్ లో లేడట. దీనికి కారణం కూడా తెలుస్తుంది, ప్రస్తుతం ఎన్టీఆర్ అయితే భుజం నొప్పితో బాధ పడుతున్నాడట.

అందుకే తాను ప్రస్తుతం షూటింగ్ మొదలు పెట్టే పరిస్థితిలో లేడని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ కి సర్జరీ లాంటిది ఏమన్నా జరుగుతుందా లేదా అనే దానిపై క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాకి అయితే హీరోయిన్ ఫిక్స్ కావాల్సి ఉండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.