Anirudh: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలకు మంచి మంచి సంగీతాన్ని అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు అనిరుధ్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో అనిరుద్ పెళ్లిపై ఎక్కువగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే అనిరుద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయినా కావ్య మారన్ తో పెళ్లి జరగనుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ వార్తలపై అనిరుద్ స్పందించారు. తన పెళ్లి అంటూ వస్తున్న ఊహగానాలను ఖండించారు. ఒక పోస్ట్ ఇందుకు కారణం అయ్యింది. ఆ పోస్టులో ఏముందంటే.. అనిరుధ్, కావ్య మారన్ గత ఏడాదిగా ప్రేమలో ఉన్నారని, కుటుంబాల మధ్య ఇప్పటికే వివాహ చర్చలు జరిగినట్లు, రజనీకాంత్ కూడా ఈ వ్యవహారంలో భాగమయినట్లు రాసుకొచ్చారు. అలాగే అనిరుధ్, కావ్య కలిసి లాస్ వెగాస్ సహా పలు ప్రాంతాల్లో వెకేషన్ లో కనిపించారన్న వదంతులు సైతం చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రూమర్స్ ఎక్కువవుతుండడంతో అనిరుధ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు.
ఏంటి పెళ్లా ? చిల్ అవుట్ గయ్స్, ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే గతంలో కూడా అనిరుద్ చాలా సందర్భాలలో పెళ్లి గురించి స్పందిస్తూ ప్రస్తుతం తాను సింగిల్ గా ఉంటున్నానని, పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనలు కూడా లేవు అని స్పష్టంగా తెలిపారు. ఇకపోతే ఆయన కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు కావ్య మారన్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సన్ గ్రూప్ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కావ్య మారన్ ఐపీఎల్ ప్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ద్వారా తెలుగువారికి బాగా చేరువైన విషయం తెలిసిందే.