‎Lokesh Kanagaraj: ఆయన లేకుండా ఏ సినిlమా చేయను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన లోకేష్ కనగరాజ్!

‎Lokesh Kanagaraj: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా పదేళ్లు పూర్తి అయ్యింది. ఈ పదేళ్ల సమయంలో ఎన్నో సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు లోకేష్ కనగరాజ్. మరీ ముఖ్యంగా మా నగరం, ఖైదీ, విక్రమ్‌, మాస్టర్‌, లియో వంటి సినిమాలతో వరుస బ్లాక్‌ బస్టర్స్‌ ని అందుకున్నారు.

‎ ఇటీవలే కూలీ సినిమా తెరకెక్కించారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ఈ మూవీ దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు లోకేష్ కనకరాజ్. ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా లోకేష్ కనగరాజ్ కోయంబత్తూరులో జరిగిన ఒక సదస్సుకు హాజరయ్యారు.

https://twitter.com/Anirudh_FP/status/1962488105015144475?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1962488105015144475%7Ctwgr%5Eaf52c995677eed86357f0ed6da6a961a9f01c340%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fdirector-lokesh-kanagaraj-announced-will-never-do-film-without-anirudh

‎ఈ సందర్భంగా ఒక సంచలన ప్రకటన చేశాడు. మీ సినిమాల్లో సంగీతం కోసం ఏఐ సాయం కోరతారా? అన్న ప్రశ్నకు లోకేశ్‌ ఇలా స్పందించాడు. నేను అనిరుధ్‌ లేకుండా ఏ సినిమా చేయను. ఒకవేళ అతడు సినిమాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుంటే అప్పుడు ఏఐ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు లేవు అని తెలిపారు.అలాగే లోకేశ్‌ ఇంకా మాట్లాడుతూ.. నేను రూ.4వేలతో షార్ట్‌పిలిం చేశాను. కెమెరా ఎవరిదగ్గరైతే ఉందో వాడే సినిమాటోగ్రాఫర్‌, ల్యాప్‌టాప్‌ ఉన్నవాడే ఎడిటర్‌. కాబట్టి ఏదైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు పెద్ద బడ్జెట్‌ లు అవసరం లేదు. ఎవరైనా దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌ గా చేయాలి అనుకున్నాను. కానీ అది జరగకుండానే డైరెక్ట్‌ అయిపోయాను అని చెప్పుకొచ్చారు లోకేష్ కనగరాజ్. కాగా లోకేశ్‌ తెరకెక్కించిన మాస్టర్‌, విక్రమ్‌, లియో, కూలీ చిత్రాలకు అనిరుధ్‌ రవిచందర్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.