“ఆర్ ఎక్స్100” లో ఒరిజినల్ శివ ఇతనే

మన తెలుగు ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి మంచి మార్పు తెచ్చింది. ఎందుకంటే అర్జున్ రెడ్డి అనే సినిమా తెలుగు సినిమాకి బోల్డ్ అండ్ రా కంటెంట్ ఎలా ఉంటుందో చెప్పింది. ఆ సినిమా తరువాత అదే దారిలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.ఇప్పుడు అదే దారిలో వచ్చిన మరో సినిమా ‘ఆర్ ఎక్స్ 100 ‘. అయితే ఈ సినిమా అర్జున్ రెడ్డిలా కాకుండా పూర్తిగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తెరకెక్కింది. ముఖ్యంగా ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం శివ క్యారెక్టర్. శివ తన ప్రేమ కోసం ప్రేయసి చేతిలో ఏ విధంగా మోసపోయాడో కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా హీరోయిన్ చేతిలో మోసపోయిన శివ..అతను అనుభవించిన బాధ అందరికి టచ్ అయ్యింది. కానీ మీకు తెలుసా శివ అనే ఒక వ్యక్తి నిజంగానే ఇందు అనే అమ్మాయి వల్ల అంత నరకం అనుభవించాడని, అమ్మాయి చేతిలో మోస పోయాడని.. చనిపోయిన శివ ఇతనే 1988లో జన్మించిన శివ 2014 లో ఇందు ప్రేమ కారణంగా చనిపోయాడు. ఆ కథనే ఆర్ ఎక్స్ 100 గా తెరకెక్కించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది చిత్ర బృందం.