Lord Shiva: ఇలా శివయ్య పూజ చేస్తే.. ఒక్క క్షణంలో మహాదేవుని కటాక్షం..!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో దేవుని ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ పరమశివుడి పూజ మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహాదేవుడికి ఆది, అంతం ఉండదు. ఆయనే అనంతం. విశ్వమంతా ఆయనలోనే కలిసిపోతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడి కరుణ పొందడం అంత సులభం కాదు అని పెద్దలు చెబుతుంటారు.. కానీ ఆయనను త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి ఒక చిన్న చిట్కాను మన పూర్వీకులు సూచించారు… అదే బిల్వ పూజ.

ప్రతి సోమవారం శివుని ఆరాధనకు అత్యంత శుభప్రదమైనదని పండితులు అంటారు. ఆ రోజున భక్తులు ఆలయాలకు వెళ్లి శివలింగానికి జలం, పాలు, పంచామృతం సమర్పించి, దీపారాధన చేస్తారు. అయితే ఇందులో ప్రధానమైనది బిల్వ ఆకులు. మూడు దళాలతో ఉండే ఈ ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సంకేతమని పురాణాలు చెబుతున్నాయి. ఈ త్రిఫల ఆకులను శివలింగంపై సమర్పించడం వలన గత జన్మల పాపాలు క్షయించిపోతాయని, భక్తులకు కైలాసలో స్థానం లభిస్తుందని నమ్మకం.

అదేవిధంగా బిల్వ పుష్పాలు కూడా శివుడి ఆరాధనలో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. సాధారణంగా ఈ ఆకులు అరుదుగా దొరికే కారణంగా, భక్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేస్తున్నారు. ఎండిన బిల్వ ఆకులు కూడా పూజకు పనికొస్తాయని పండితులు సూచిస్తున్నారు.

భక్తులు శివలింగానికి బిల్వ ఆకులు సమర్పిస్తూ బిల్వాష్టకం అనే స్తోత్రాన్ని చదివితే, అది మహాదేవుని మరింత సంతోషపరుస్తుందని చెబుతారు. ఆ క్షణంలోనే భక్తుని ఆధ్యాత్మిక జీవితం ఉజ్వలమవుతుందని విశ్వాసం. అంతేకాదు, శివుడికి ఒక్క బిల్వ ఆకు సమర్పించినా, జీవితాంతం చేసిన పూజల ఫలితాన్ని సమానంగా ఇస్తుందని పురాణాలు పేర్కొంటాయి.

భక్తుల విశ్వాసం ప్రకారం శివుని ఆరాధన వల్ల కేవలం ఆధ్యాత్మిక శాంతి మాత్రమే కాకుండా, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం కూడా దక్కుతాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. అందుకే శివ పూజలో బిల్వ ఆకులకు అంతటి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన సోమవారంలో మహాదేవునికి బిల్వ ఆకులు సమర్పించి ఆయన కటాక్షాన్ని పొందండి. ఒక్క ఆకు సమర్పించినా సరిపోతుంది.. అది మీ జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉందని భక్తుల విశ్వాసం.