ఆ ముగ్గురిపై రాజమౌళి ప్రశంసలు

బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రశంసల జల్లులు ఆ ముగ్గురిపై కురిపించారు . సినిమా రంగంలో ఒక దర్శకుడు సినిమా  విజయం సాధిస్తే మరో దర్శకుడు అభినందించడం చాలా అరుదుగా  జరుగుతుంది . అయితే  గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన “అరవింద సమేత  వీర రాఘవ”  సినిమా అన్ని చోట్ల నుంచి మంచి రోపోర్ట్స్ మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా అదరగొట్టేస్తున్నాయి .

ఈ సినిమా చూసిన  రాజమౌళి “దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , హీరో నందమూరి తారక రామా రావు , ప్రతి నాయకుడు జగపతి బాబు గురించి మనస్పూర్తిగా మాట్లాడాడు . ఫ్యాక్షన్ సమస్యలపై గతంలో అనేక సినిమాలు వచ్చినా “అరవింద సమేత  వాటికన్నా భిన్నమైనది . ఫ్యాక్షన్ ను నివారించి శాంతిని నెలకొల్పుదామనే ఆలోచన చాలా గొప్పగా వుంది . సినిమా ప్రారంభం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది .

ఇక ఎన్టీఆర్ నటన ఎంతో గొప్పగా అనిపించింది . నేను ఊహించలేదు . అలాగే ప్రతి నాయకుడు పాత్రలో జగపతి బాబు చాలా గొప్పగా చేశాడు . వీరిద్దరూ చాలాకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతారు ” అని చెప్పాడు .